వంతెన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
కాంటిలీవర్ పద్ధతిలో కొన్ని వంతెనలను తయారయ్యాయి. ధృఢంగా ఉండే స్తంభానికి లంబంగా వంతెన భాగం ముందుకు చొచ్చుకొని వచ్చేలా దీన్ని నిర్మిస్తారు. వంతెన కింది భాగంలో మరే ఆధారమూ ఉండదు. ప్రాచీన చైనా లో ఇలాంటి మొరటు నమూలాలుండేవి. 19 వ శతాబ్దం ప్రారంభ కాలంలో చేత ఇనుము తో పనిముట్ల తయారీ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇనప దూలాలతో వంతెనలు నిర్మించబడేవి. మెనాయ్ జలసంధి మీద బ్రిటానియా వంతెనని ఈ పద్ధతిలోనే నిర్మించారు. ఇలాంటి వంతెనలు చూడటానికి అందంగా ఉండవు. కమాను వంతెనలైతే చూడ ముచ్చటగా ఉంటాయి. కాబట్టి పురాతన కాలం నుంచీ కూడా ఇంజనీర్లకు వీటిపై మోజు ఎక్కువ. మొదట్లో వంతెనకు సంబంధించిన స్తంభాలను రాతితో గానీ, ఇటుక తో గానీ కట్టేవారు. 18 వ శతాబ్దం చివరి భాగం నుంచి ఇనుమును, ఉక్కును వాడటం ప్రారంభించారు. ఇలాంటి వంతెనలు జర్మనీ, నార్వే, స్వీడన్ దేశాల్లో ఉన్నాయి. 1963 లో చెనపీక్ అఖాతానికి అడ్డంగా వర్జీనియా లో 17.5 మైళ్ళ పొడవు గల వంతెననినిర్మించటం జరిగింది. ఇక్కడ ఉపయోగించిన ఉక్కు చట్రం పొడవు 12 మైళ్ళుంది. దీని కింద పెద్ద ఓడలు వళ్ళ టానికి కూడా వీలు కలగజేశారు.
 
మధ్య యుగాల్లో వంతెన నిర్మాణాన్ని ధర్మకార్యంగా భావించేవారు. కానీ నేడు అదొక సాంకేతిక, కళాత్మక కార్యంగానూ, మూల భూతమైన సామాజిక అవసరాన్ని తీర్చే సాధనంగానూ పరిణమించింది. వంతెన రూపు రేఖలు ఎలా ఉండాలో, ఏ పదార్థాలతో దాన్ని నిర్మించాలో నిర్ణయించే ముందు ఆ వంతెనని ఉపయోగించబోయే ప్రజల అవసరాల్ని ఇంజనీర్లు పరిగణించాల్సి ఉంటుంది. పైగా, అది చూడటానికి అందంగా కూడా ఉండాలి. అయితే ఈ అందాన్ని నిర్ణయించటానికి నిర్ణీత నియమాలంటూ ఏవీ లేవు. ఇంతే కాకుండా వంతెనపై ఏ రకమైన రవాణా ఉంటుందో, ఎంత ఉంటుందో, ఓడలు, రైళ్ళు, ఇతర వాహనాలు వెళ్లటానికి వీలు కల్పించాలో లేదో - ఇలాంటి విషయాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. నిర్మాణ పదార్థాలు కొయ్య,రాయి, ఇటుక, ఉక్కు, తేలిక లోహ మిశ్రమం లేదా కాంక్రీట్ ఉండవచ్చు. కడపటి మూడు పదార్థాలను, అందులోనూ విస్తృతంగా పరిశీలించి వంతెన నిర్మాణానికి పూనుకోవాలి. ఇలా చేసినప్పుడే అది సమర్థవంతంగా చౌకగానూ , అందంగాను ఉంటుంది.
 
== వంతెనలలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/వంతెన" నుండి వెలికితీశారు