వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1113900 (translate me)
చి Robot: Automated text replacement (-మరళా +మరల)
పంక్తి 10:
[[బహుమనీ]] సుల్తాను [[మహమ్మద్ షా]] ఆదేశానుసారం అతని సామంతుడు [[యాసుఫ్ ఆదిల్ఖాన్]] [[1502]]లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించినాడు, కానీ [[అరవీటి రామరాజు]] కుమారుడు [[అరవీటి తిమ్మరాజు]] కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను [[అరవీటి తిమ్మరాజు]]నకు విజయానికి కానుకగా ఇచ్చినాడు. ఈ సంఘటన వల్ల [[ఆరవీటి వంశము|అరవీటి]] వంశస్తులూ, [[తుళువ]] వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
 
వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన [[శ్రీ కృష్ణదేవరాయలు]]ను రాజ్యపాలనకు నియమించి, [[1508]] నాటికి [[ఉమ్మత్తూరు]], [[శ్రీరంగపట్టణము]]లను ఓడించి విజయనగరము వచ్చినాడు, కానీ మరళామరల వీరు తోక జాడించినారు. దానితో ఈ సారి తన సోదరులగు [[అచ్యుత రాయలు]], [[శ్రీరంగ రాయలు]]ను సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో [[కొంకణ]] ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించినాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
 
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.
"https://te.wikipedia.org/wiki/వీరనరసింహ_రాయలు" నుండి వెలికితీశారు