నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 179 interwiki links, now provided by Wikidata on d:q837 (translate me)
చి Robot: Automated text replacement (-ఆదార +ఆధార)
పంక్తి 136:
== ఘాట్ రోడ్డు ==
నేపాల్ దేశం కొండలమయమైనందున అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. కొండ వాలులో రోడ్డుకు సరిపడినంత మేర చదును చేసి కొడ వాలు వెంబడి వంకర టింకరగా మెలికలు తిరుగు తూ రోడ్లుంటాయి. బస్సులో వెళు తుంటే ఒకవైపు ఆకాశం అంతెత్తున్న కొండలు, మరొక వైపున పాతాళం కనిపిస్తున్నదా అన్నంత లోతున ప్రవహిస్తున్న నది ఇలా వందలాది మైళ్ల పర్యంతం కనబడుతూనె వుంటుంది. లోయలో ప్రవహిస్తున్న నదిలొ అతి శుబ్రమైన నీరుంటుంది. ఆనది కూడ అనేక మలుపులు తిరుగుతూ ఎగుడు దిగుడుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఆ నదిలో రాళ్లన్ని అతి నును దేలి కాలు పెడితే జారిపోయేటట్లుంటాయి. వాటినే సాలగ్రాం లంటారు.
నదులు చిన్నవైనా అవి అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ నదులలో సాహసికులు ప్రత్యేక బట్టలు వేసుకుని తలకు టోపి పెట్టుకొని రబ్బరు బోట్ల లో పోటి పడుతుంటారు. కొండ వాలులో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇదొక ఆనంద కరమైన దృశ్యం. రోడ్డు ప్రయాణికులకు టీ, కాపి, అల్పాహారం అందించడానికి అక్కడక్కడా చిన్న చిన్న జనవాసాలుంటాయి. అక్కడే సాహసిక క్రీడలైన '''రాప్టింగ్ ''' (నదిలో రబ్బరు బోట్ల పోటీ) '''ట్రెక్కింగ్''' ( తాళ్ల సాయంతో కొండలనెక్కే సాహస క్రీడ) లకు కావలసిన సామాగ్రిని అద్దెకిచ్చే దుకాణాలుంటాయి. ఇటు వంటి నివాస ప్రాంతాలలో కూడ నీటి వసతికి నది అత్యంత లోతులో నున్నందున దానిపై ఆదారఆధార పడకుండా కొండలపై నుండి జాలువారె జల దారలకు పైపు తగిలించి వారి అవసరాలకు వాడు కుంటారు. ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులకు మరొక ఆచ్యర్య పరిచే వినోదం మరొకటి కను విందు చేస్తుంది. అవతిలి కొండ వాలులో పంటలు పండించే రైగులు ఇవతల నుండి నదిని దాటి అటు పక్కకు వెళ్లాలంటే. కొన్ని వందల అడుగుల లోతు కు దిగి అతి వేగంగా ప్రవహించే నదిని దాటి తిరిగి ఆ కొండ నెక్కి తమ పొలాలకు వెళ్ళాలి. ఆ నది చిన్నదే అయినా అతి వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులోని రాళ్లు అతి నునుపుగా కాలు జారేటట్టుంటాయి. ఇటు వంటి ప్రమాదాన్నుండి తప్పించు కోడానికి వారు ఒక ఉపాయం కనిపెట్టారు. ఇవతల కొంత దిగువన ఒక బలమైన స్థంబాన్ని పాతి దానికి సమానాంతరంగ నదికి అవతిలి వైపున కూడ ఇలాంటి స్థంబన్ని పాతి ఈ రెండు స్థంబాలను ఒక బలమైన ఇనుప మోకుతో అనుసందానిస్తారు. పైన చక్రాలు కట్టిన ఊయాల లాంటి ఒక పెద్దబుట్టను ఆ ఇనుప మోకుకు తగిలించి ఆ బుట్టలో కూర్చొని తమ చేతులతో ఆ ఇనుప మోకును తమవైపుకు లాగుతూ వుంటే తాము కూర్చున్న ఆ బుట్ట ముందుకు సాగి అవతలి గట్టుకు చేరు కుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రమాదకరమైన పనిగా అనిపిస్తుంది. ఇటువంటి సాహసాలు దారి పొడుగునా కనబడుతూనె వుంటాయి. ఒక్కోచోట కేవలం ఒక మనిషే కోతిలాగ ఆ ఇనుప తాడును పట్టుకొని అవతలికి వెళ్లే సందర్బాలు కూడ చూడొచ్చు. ఇలా ఎన్నో ప్రమాద భరితమైన సాహాసాలు చూస్తు ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులలు కూడ అత్యంత ప్రమాదం పొంచి వుంటుంది. అదేమంటే వర్షాకాలంలో కొండ చెరియలు విరిగితే అవి ఖచ్చితంగా ఆ రోడ్డు పైనే పడతాయి. వాహనాలపై పడితే ఇక చేయగలిగింది ఏమీలేదు. ఖాళీ రోడ్డు పడినా వాటిని తొలిగించేంత వరకు వారి ప్రయాణం వాయిదా పడాల్సిందే.
 
== పోక్రా లో దేవి జలపాతం ==
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు