"సుభాషిత త్రిశతి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
సుభాషిత త్రిశతి రచయిత [[భర్తృహరి]]. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాలను అనువాదం చేసిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. ఇందు ఏనుగు లక్ష్మణకవి రచించిన పద్యాలు బాగా [[ప్రసిద్ధి]] చెందాయి. ఈయన 18వ శతాబ్దికి చెందిన కవి.
==కవి పరిచయం==
 
సుభాషిత త్రిశతి యను పేరుగల ఈ నీతి గ్రంధమును భర్తృహరి యను పేరు గల యోగీశ్వరుడు రచించెనని ప్రతీతి కలదు. ఈ భర్తృహరి యెక్కడివాడో యెప్పటివాడో స్పష్టముగా చెప్పుట సాధ్యముకాదు. కాళిదాసు వంటి కవులను పోషించిన విక్రమార్కునకు భర్తృహరి యను సోదరుడొకడుకలడని విక్రమార్క కథలందు వినబడుచున్నది. పాణినీయ వ్యాకరణమున త్రిపాదికి వివరణమును, వాక్యపదీయము రచియించిన భర్తృహరి యొకడు కలడు. భర్తృహరి నిర్వేద నాటకమున బ్రస్తుతుండగు భర్తృహరి యొకడు కలడు. వీరందరు వేర్వేరు పురుషులో లేక యొక్కరో తెలియదు. విక్రమార్కుని సోదరుడే యీ కృతి కర్త యగునేని ఈతడు క్రీ.పూ. ప్రథమ శతాబ్దినాటివాడగును. మొదటి విక్రమార్కుని గూర్చియే పలు తగవులున్నవి. కొందరు శూద్రకునికే విద్రమార్కుడని నామాంతర మనుచున్నారు. అనిశ్చితము అయిని కవి దేశ కాలముల గూర్చి యిక చర్చ సరిపోతుంది.
 
 
<blockquote>శ్లో. న ద్యాతం పద మీశ్వరస్య విధి వత్సంసార విచ్చిత్తయే<br />స్వ్ర్గ స్వారకవాట పాటనపటుర్ద ర్మో౽పి నోపార్జితః<br />నారీపీనపయోదరోరుయుగళీస్వాప్నే ౽ పి నాలింగితా<br />మాతుః కేవలమెవ యౌ వనవనచ్ఛేదే కుఠారావయమ్</blockquote>
==తెలుగు అనువాదము==
 
నానా దేశములందు నానా భాషల లోనికి ఈ త్రిశతి అనువదింపబడినది. తెలుగునను దీనిని బలువురు పరివర్తించిరి. అందు ముఖ్యులు ముగ్గురు. మహోపాథ్యాయ బిరుదాంకుడుగు ఎలకూచి బాల సరస్వతియు, ఏనుగు లక్ష్మణ కవియు, పుష్పగిరి తిమ్మకవియు, . ఎలకుచి బాలసరస్వతి జటప్రోలు సంస్థానాధీశ్వరుడగు సురభి మల్ల భూపాలునకు కంకితముగా మల్ల భూపాలీయ మను పేర దీని దెనిఁగించెను. "సురభిమల్లా నీతి వాచస్పతీ, సురభిమల్లా మానినీ మన్మథా" అని ప్రతి పద్యము చివరను కృతి పతి సంబోధనము చేర్చుటచే నాతడు చిన్ని శ్లోకమును దెలిగించుటలో సరిపోదగిన వృత్తములో గడపటి చరణమును గోల్పోవలసి వచ్చుట యను నసౌకర్యమునకు బాల్పడెను. కావున నాతని తెలిగింపు కొన్ని పట్తుల లక్ష్మణకవి కృతికి వెన్బడుచున్నది. ప్రశస్త తరముగా నీ త్రిశతిని దెలిగించి లక్ష్మణకవి రామేశ్వరమాహాత్మ్యాదులగు నితర కృతుల గూడ గొన్నింటి రచించినాడు గాని వానిలో కవిత బాలసరస్వతి చంద్రికా పరిణయాది కృతులలోని కవితకు మిక్కినియు దీసిపోవునదిగానే యున్నది. లక్ష్మణ కవి కృతులలో నీ త్రిశతి తెలిగింపే మిక్కిలి ఇంపయినదై సుప్రఖ్యాతమయి యున్నది. పుష్పగిరి తిమ్మ కవియు నీ సుభాషిత త్రిశతిని దెలిగించినాడట.
==భర్తృహరి సుభాషితాల లో వివిధ భాగములు==
* కర్మ పద్ధతి
===శృంగార శతకం===
* స్త్రీ ప్రశంసా
 
* సంభోగ వర్ణనము
* కామినీ గర్హణము
* సువిరక్త పద్ధతి
* దుర్విరక్త పద్ధతి
* ఋతు వర్ణన పద్ధతి
 
===వైరాగ్య శతకం===
* తృష్ణా దూషణము
 
* విషయ పరిత్యాగ విడంబనము
* యాచ్ఞా దైన్య దూషణము
* భోగా స్థైర్యవర్ణనము
* కాలమహిమాను వర్ణనము
* యతినృపతి సంవాద వర్ణనము
* మనస్సంబోధన నియమనము
* నిత్యానిత్య వస్తు విచారము
* శివార్చనము
* అవధూత చర్య
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/824436" నుండి వెలికితీశారు