భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
ఇక గ్రంథ నిదర్శనము లంతగా కవికాల నిర్ణయమున కుపకరింపక పోవుటయే కాగ సందిగ్దములు కూడ నైయున్నవి. ఆ శతకములు వేదాంత పరిభాషా జటిలములు. ఆయనను వేదాంత సిద్ధాంతములు వందల కొలది సంవత్సరములుగా చర్చొతములై పూర్వ పక్ష సిద్ధాంతీకరనముల నిష్పత్తి నొందినవి కావున కేవలము వాని యాధారమున కాల నిర్ణయమసాధ్యము. ఈ సిద్ధాంతములను లోక సామాన్యమునకు ప్రప్రధమమున వెల్లడించిన వారు కుమారిల భట్టులు. వీ రెనిమిదవ శతాబ్దమువారు. తర్వాత వారు ఆది శంకరులు. వీరు తొమ్మిదవ శతాబ్దమువారని కొందరును, కారని కొందరును వాదింతురు. కావున వేదాంతము తొమ్మిదవ శతాబ్దమాదిగా వ్యాపృతి నందినా దాని యుద్భవమంతయు బహుకాలము పూర్వమే యనుట సువిదతము కదా! కనుక వేదాంత పరిభాష నాశ్రయించి మనము కవికాల మూహింపనెంచుత సమంజసము కాదు.
 
భర్తృహరి శతకములను వ్యాఖ్యానించినవారు మహాబలుడు, ఆవంచ రామచంద్రబుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు అను వారలని సంస్కృత వాఙ్మయ చరిత్రకారులు శ్రీ యుత కావ్య వినోదులు కృష్ణమాచార్యుల వారు పేర్కొని యున్నారు. వారిలో నొక్కరైనను కవికాల నిర్ణాయక విషయమై శ్రద్ధ పూనినట్లు కానరాదు. కాని వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశమున గాదు, యావద్భారతమునకు వ్యాప్తి నందుయున్నది. ఆయన పీఠికలో
 
 
 
(సశేషం)
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు