భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
<u>పై విషయ వర్యాలోచన ఫలితంగా భర్తృహరి విక్రమార్కుని కాలమున, అనగా క్రీ.పూ ప్రథమ శతాబ్ది మధ్యమున వెలసె నని నిశ్చయింపవచ్చును.</u>
==భర్తృహరి చాటిన సిద్ధాంతములు==
వేదములందును వేదాంత సిద్ధాంతములందును ధర్మపరులకు విశ్వాస మత్యవసరము. పరబ్రహ్మమందు లయించుటయే యానందమునకు పరమావధి. తత్సిద్దికై ఆశా త్యాగము, వైరాగ్యానుభవము, కర్మోస్మూలనమును సాధనములు. ఇవియు ముఖ్య వేదాంత సిద్ధాంతములు, కనుక భర్తృహరి వేదాంత మతామలంబకుడనుట విస్పష్టము. అచ్చటచ్చట యోగమును, దశావతారములను, గంగను, గిమాలయములను బ్రశంసించి యుండుట జూడ మానవులు తమ దైనందిన చర్యలలో నెట్టి దృష్టితో వ్యవహరింపవలెనని కవి యుద్దేశించెనో తెలియును.
 
పురుషుడీ లోకమున వాంచింపదగిన వానిలో నతి ముఖ్యమైనది ఆత్మ గౌరవము. అన్నెన్ని సంకటములు పైకొన్నను ఆత్మ గౌరవమునకును స్వాతంత్రమునకును లోటు పాటు కలుగనీయరాదని యెంతో మృదుల మగు భాషలో నెన్నో పట్తుల కవి వివరించెను. మానవ దృష్టి లక్షింప దగిన రెండవగుణము పట్టుదల, దృఢపవృత్తి, అభినివేశమును వ్యవసాయమును కొరత పడిన నేకార్యమును సిద్ధింపదు. ధీరులు తాము పూనిన కార్యము సిద్ధినందు వరకు వదలరని రూధిగా పలిగెను. కవి మన దుద్భోధింపనెంచిన మూడవ నీతి ధర్మానుష్ఠానము. సాంఘిక సేవ, పరోపకాది మహిమలు వర్ణించు శ్లోకము అతి సుందరములు. భావగంభీరములై యున్నవి. భర్తృహరి రచనలు ధైర్యమునందు సచ్ఛీలమునందు వాస్తవాభినివేశమును పురికొల్పును. సద్గుణము లన్నింటిలో సచ్చీలము ఉత్తమోత్తమస్తానమధిష్టించు ననుట కవి మతము. తన్మూలమున సాధింపదగిన శ్రేయములను పలురీతుల వివరించియున్నాడు కవి.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు