జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
వర్థమాన మహావీరుడు ఒకసారి నాలందాను దర్శించినప్పుడు అతనికి గోశాల ముస్కరీ పుత్రుడనే ఒక సన్యాసితో పరిచయం అయింది. వర్థమానునితో ప్రభావితుడైన ఆ సన్యాసి ఆరేళ్ళు వర్థమానుని తత్వాన్ని ప్రభోధించాడు. ఆ తరువాత అతడు చీలిపోయి "ఆజీవక మతాన్ని" స్థాపించాడు. వర్థమానుడు పదమూడు సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. శరీరం శుష్కించి పోయింది. ఆ తరువాత వైశాఖ మాసం పదమూడవ రోజున జృంభిక గ్రామం (పార్శ్వ నాధ పర్వతాల దగ్గర) లో అతనికి "అంతర్భుద్ధి" కలిగింది. తరువాత అతడు 42 వ యెట మహావీరుడు లేదా జినుడు అయ్యాడు. అతని అనుచరులను నిర్గ్రంధులన్నారు. నిర్గ్రంధులు అంటె బంధాలు లేనివారు. తరువాత ముప్పై సంవత్సరాలు అతడు కోసల, మగధలలోనే కాక ఇంకా తూర్పు వైపుకు వెళ్ళీ తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను తరచు కలిసేవాడు. అతడు తన డెబ్బై రెండవ యేట పావా(పాట్నా) జిల్లాలో బి.సి.527 లో మరణించాడు. కాని కొంతమంది పండితులు అతడిని బుద్ధుని కంటే చిన్నవానిగా భావించి బి.సి.458 లో మరణించాడన్నారు.
==మహావీరుని బోధలు==
ఇతడి బోధనలు తాత్వికాలు. శృతి, స్మృతుల మీద అతడి బోధలు అధారపడలేదు. ఒక అర్థములో అతడు దేవతలు లేరన లేదు. కాకపోతే వారికి దివ్యత్వం లేదన్నాడు.అందువల్ల అతడు మతం నాస్తికం. వారివల్ల మానవులకు ఎటువంటి ప్రయోజనములేదు. తీర్థంకరుల కంటే వారు నిస్సందేహంగా తీసికట్టే. అతడి తత్వం ద్వైతం. అతడి ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవులు, రెండు అజీవులు. అజీవులు పదార్థం. అజీవులు అణు నిర్మితాలు. జీవులు అమర్త్యాలు. అజీవులు మర్తాలు. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది.
 
== ఆంధ్రప్రదేశ్ లో జైన మతం ==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు