జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
 
ఆత్మ సహజంగా కాంతివంతమైనది. సర్వజ్ఞాని, ఆనందమయి. ఈ విశ్వంలో అనంత సంఖ్యలో ఆత్మలున్నాయి. ప్రాధమికంగా అన్నీ సమానులే. కాని పరాపరమాణు పదార్థం అతుక్కోవడాన్ని బట్టి అవి వేరు వేరు అనిపిస్తాయి. అవి ఆత్మను కప్పడం వల్ల ఆత్మ కాంతి తగ్గిపోతుంది. ఆత్మలు జంతువులకు మనుషులకే కాక, రాయి రప్పకు, నీటికి కూడా ఉంటాయి.
 
పునర్జన్మ రాహిత్యం కావాలంటె మోహ వికారాదులను, ఇంద్రియానుభవాలను క్రమంగా తొలగించుకోవాలి. అందువలన, సన్యాసం, తపస్సులు అవసరమవుతాయి. చివరకు కర్మ శరీరాన్ని తొలగించుకొన్న సన్యాసి మహావీరునిలా, మరణం అంటే భయపడక, ఆహారత్యాగంతో మరణించాలి. తిరిగి పుట్టని ఆత్మ నిర్వాణాన్ని పొందుతుంది. నిర్వాణం అంటే ఏమిటో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వివిధ మతాలు, వివిధ వ్యక్తులు, దానిని వివిధంగా వర్ణించారు. కాని జైన మతంలో నిర్వాణం అంటే ఉన్నత స్వర్గం కంటె పైన నిషియాత్మకమైన సర్వజ్ఞానమయమైన శాశ్వతానుభవం.
 
== ఆంధ్రప్రదేశ్ లో జైన మతం ==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు