ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
జర్మనీలోని విట్టెంబర్గ్ (Wittenberg) నగరంలో డాక్టర్ ఫాస్టస్ అను పండితుడు ప్రపంచంలోని సమస్త విషయాలు తెలుసుకోవడంలో మానవ విజ్ఞాన పరిధులు దాటిపోయినా సంతృప్తి చెందక మంత్ర విద్యలు నేర్చుకోవాలనుకుంటాడు. అంతలో క్రైస్తవ తత్వానికి మరియు నాశన మార్గానికి సాదృశ్యములైన మంచి దేవత (Good Angel) మరియు దుష్ట దేవత (Bad Angel) ఫాస్టస్ వద్దకు వస్తాయి. మంచి దేవత మంత్ర విద్యలను వదిలివేయమని చెడు చేవత మత్ర విద్యలను నేర్చుకోమని చెబుతాయి. తోటి పండితులైన వాల్డెస్ (Waldes)మరియు కొర్నేలియస్ (Cornelius) వద్దనుండి ప్రాధమిక మంత్ర విద్యలు నేర్చుకొంటాడు. బైబిలులో సాతాను (Satan) సహచరుడైన మెఫిస్టోఫిలిస్ (Mephistophilis)అను దెయ్యాన్ని ఫాస్టస్ పిలుస్తాడు. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం మెఫిస్టోఫిలిస్ ఫాస్టస్ కు సేవకుడిగా ఉండి 24 సంవత్సరాల సర్వాధికారం ఇస్తే, గడువు తర్వాత ఫాస్టస్ తన ఆత్మను మెఫిస్తోఫిలిస్ కు ఇచ్చేయాలి.
 
మెఫిస్టోఫిలిస్ ఇచ్చిన ఒప్పంద పత్రం పై ఫాస్టస్ తన రక్తంతో సంతకం చేస్తాడు. అంతే ఫాస్టస్ చేతులపై FlyO man, Manfly అను పదాలు కనిపిస్తాయి. ఫాస్టస్ కు భయం పట్టుకోగా మెఫిస్టోఫిలిస్ ఇతర దెయ్యాలను నాట్యమాడించి ఫాస్టస్ దృష్టిని మళ్ళిస్తాడు. భార్య కావాలని ఫాస్టస్ అడుగగా మెఫిస్టోఫిలిస్ నిరాకరించి, అందుకు ప్రత్యామ్నాయంగా విజ్ఞాన సంబంధిత పుస్తకాలను ఇస్తాడు.
 
కొంత కాలం గడచిన తర్వాత ఒక దశలో ఫాస్టస్ ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ తనకు స్వర్గలోక ప్రవేశం లేదని అన్న మెఫిస్టోఫిలిస్ ను శపిస్తాడు. ఫాస్టస్ పెట్టే హింస భరించలేక మెఫిస్టోఫిలిస్ వెళ్ళిపోతాడు. మంచి దేవత మరియు దుష్ట దేవత తిరిగి వస్తాయి. ఫాస్టస్ ను పశ్చాత్తాప పడమని మంచి దేవత చెప్పగా, అన్న మాటకు కట్టుబడియుండమని చెడు దేవత చెబుతుంది.. ఫాస్టస్ ను భయపెట్టడానికి లూసిఫర్ (సాతాను), బీల్జిబబ్ ([[Beelzebub]]) మరియు మెఫిస్టోఫిలిస్ తిరిగి వస్తారు. భయపడిపోయిన ఫాస్టస్ దేవుడి గురించి ఆలోచించడానికి వీలు లేకుండా వారితో మాట్లానికి ఒప్పుకుంటాడు. ఫాస్టస్ కు నరకం చూపిస్తానని లూసిఫర్ మాట ఇస్తాడు.