"ఇలియానా" కూర్పుల మధ్య తేడాలు

4,371 bytes added ,  7 సంవత్సరాల క్రితం
కొత్త విషయం చేర్చి "సినీ జీవితం" భాగాన్ని సవరించాను
(ముఖ్యసవరణలు చేయబడ్డాయి)
(కొత్త విషయం చేర్చి "సినీ జీవితం" భాగాన్ని సవరించాను)
===2007-2011 : తెలుగు సినిమాల్లో ఎదుగుదల===
అప్పటికే తన ప్రతిభతో తెలుగులో మంచి గుర్తింపుని సాధించిన ఇలియానా విజయాలు మరియూ పరాజయాలకు అతీతంగా తిరుగులేని తారగా ఎదిగింది. 2007లో [[సిద్దార్థ్]] సరసన నటించిన [[ఆట (2007 సినిమా)|ఆట]] చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 2008లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన జల్సా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ రెండు చిత్రాల్లో ఇలియానా నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు ఇలియానా జల్సా చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది. ఆ తర్వాత [[తరుణ్ కుమార్]] సరసన నటించిన [[భలే దొంగలు (2008 సినిమా)|భలే దొంగలు]] ఓ మోస్తరు విజయం సాధించినా, 2009లో రవితేజ సరసన తను నటించిన [[కిక్ (సినిమా)|కిక్]]' సినిమా ఆ సంవత్సరంలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కూడా తను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది.
 
కిక్ వంటి భారీవిజయం తర్వాత ఇలియానా నితిన్ సరసన [[రెచ్చిపో (సినిమా)|రెచ్చిపో]], మంచు విష్ణు సరసన [[సలీం (సినిమా)|సలీమ్]] చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత 2011లో ఇలియానా రెండు చిత్రాల్లో నటించింది. ఒకటి మెహెర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన [[శక్తి (2011 సినిమా)|శక్తి]]. మరొకటి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సరసన [[నేను నా రాక్షసి]]. ఈ రెండు చిత్రాలు కూడా పరాజయం పాలైనప్పటికీ నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.
 
===2012-ప్రస్తుతం : హిందీ సినిమాల్లోకి తెరంగేట్రం===
2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది ప్రముఖ హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో [[అల్లు అర్జున్]] సరసన [[జులాయి]] చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా అనూహ్యమైన రీతిలో విజయం సాధించింది. అదే ఏడాది రవితేజ సరసన [[దేవుడు చేసిన మనుషులు (2012 సినిమా)|దేవుడు చేసిన మనుషులు]] చిత్రంలో నటించింది. ఈ చిత్రం మాత్రం పరాజయం పాలైంది. కానీ ఇందులో రవితేజ మరియూ ఇలియానాల నటనకు మంచి ప్రశంసలందాయి.
 
ఆ ఏడాది ఇలియానా అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీ చిత్రంతో హింది సినిమల్లోకి అడుగుపెట్టింది. రణబీర్ కపూర్, [[ప్రియాంక చోప్రా]] ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇందులో ఇలియానా పోషించిన శృతి పాత్రకు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకున్న ఇలియానా అదే చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డ్ ను గెలుచుకుంది. ప్రస్తుత తరం కథానాయికల్లో [[ఆసిన్]], [[కాజల్ అగర్వాల్]] తర్వాత తొలిచిత్రంతోనే భారీ విజయం అందుకున్న దక్షిణాది కథానాయికగా ఇలియానా కొనియాడబడింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన ఫటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో నటిస్తోంది ఇలియానా.
 
==వ్యక్తిగత జీవితం==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/826360" నుండి వెలికితీశారు