సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
కథలో ముఖ్యసవరణలు చేయబడ్డాయి
పంక్తి 26:
ఈ చిత్రం యొక్క మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం రేలంగి మావయ్య (ప్రకాష్ రాజ్) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు మరియు కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి రేలంగి మామయ్య. ఆ ఊరిలో అందరికీ రేలంగి మావయ్య అంటె ఎనలేని అభిమానం. అందరితో సంతోషంగా, ఆనందంగా బ్రతకాలనుకునే ఇతనికి పెద్దోడు (వెంకటేష్) మరియు చిన్నోడు (మహేష్ బాబు) అని ఇద్దరు కొడుకులు ఉంటారు. వీరిలో పెద్దోడు చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తలవంచుకునే వ్యక్తిత్వం కాదు. తనకు నచ్చింది చేసి మంచి అవకాశం కోసం చూసే వ్యక్తి, నిరుద్యోగి, తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. సీత (అంజలి) అతనికి మరదలు. ఆ ఇంట్లో సీత చెయ్యలేని పనిలేదు, ప్రేమించబడని మనిషి లేడు. కానీ చిన్నప్పటి నుండి సీత ఎప్పటికి అయిన పెద్దోడే తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది. మరో ప్రక్క చిన్నోడు ఎటువంటి పరిస్థితిని అయినా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. చిన్నోడు తన బంధువుల పెళ్ళిలో పెళ్ళికూతురు చెల్లెలైన అయిన గీత (సమంత)ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మామయ్య కుటుంబానికి సంపద తక్కువగా ఉందని గీత తండ్రి (రావు రమేష్) చులకనగా చూస్తుంటాడు.
 
ఇదిలా ఉండగా రేలంగి మావయ్య తన కూతురిని ఇంటికి తీసుకురావడానికి వైజాగ్ వెళ్తాడు. అక్కడ గీత అక్క, తన మొగుడు మరియూ అత్త మామలతో అదే ట్రైను ఎక్కుతుంది. ట్రైనులో ఒకే చోట కూర్చున్న వీరందరూ మాట్లాడుకుంటూ ఉండగా గీత అక్క వాళ్ళ అత్త మామలు తమ రెండో కొడుకుతో రెలంగిరేలంగి మావయ్య కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. గీత కుటుంబం విజయవాడలో ఉంటారు. గీత చనిపోయిన పెద్దనాన్న కూతురే సీత. మొదటి నుంచీ గీత తండ్రికి రేలంగి వారిపై సదాభిప్రాయం లేదు. అందులోనూ పెద్దోడికి కూడా వారిపై సదాభిప్రాయం లేదు.కాబట్టి ఆ సంభందానికి పెద్దోడు ముందు అంగీకారం తెలుపడు. కానీ చిన్నోడు నచ్చజెప్పాక ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. వైభవంగ జరిగిన ఆ పెళ్ళిలో గీత తండ్రి మళ్ళీ రెలంగిరేలంగి వారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇది పెద్దోడిలో వారి పట్ల మరింత ద్వేషాన్ని నింపుతుంది.
 
పెళ్ళి జరిగిన మరుసటిరోజు హైదరాబాద్లో స్థిరబడ్డ ఆ ఊరి మనిషి పెద్దోడిని హైదరాబాద్ రమ్మని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. సాధారణంగా ఒకరి కింద పనిచేయడం ఇష్టంలేని పెద్దోడు చిన్నోడి మాట విని హైదరాబాద్ కి తనతో పాటు వెళ్తాడు. కానీ అక్కడ తనకి పరాభవం జరుగుతుంది. దానితో వేరే ఉద్యోగం వెతకాలని పెద్దోడు అనుకుంటాడు. ఇంతలో చిన్నోడు, గీత ల ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి గీత చిన్నోడిని ఒక హోటలుకు రమ్మంటుంది. కానీ అక్కడ తన పూర్తి కుటుంబం ఉన్నదన్న విషయాన్ని చెప్పదు. మళ్ళీ అక్కడ గీత తండ్రికీ, చిన్నోడికీ మధ్య అభిప్రాయభేదాలు వచ్చి చిన్నోడు అలిగి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న పెద్దోడు గీతతో చిన్నోడిని చూస్తాడు. ఆ రాత్రే పెద్దోడు చిన్నోడికి ఒక్కమాట చెప్పకుండా ఊరు వెళ్ళిపోతాడు. దీనివల్ల పెద్దోడికీ, చిన్నోడికీ మధ్య దూరం పెరుగుతుంది. ఇరువురి మధ్యగల దూరం వల్ల చిన్నోడు ఒకనాడు గీతతో గొడవపడి విడిపోతాడు. ఒకేసారి గీత, సీతలకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెడతారు వారి పెద్దలు.
 
==తారాగణం ==