సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

కథలో ముఖ్యసవరణలు చేయబడ్డాయి
కథలో ముఖ్యసవరణలు చేయబడ్డాయి
పంక్తి 24:
 
==కథ==
ఈ చిత్రం యొక్క మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం రేలంగి మావయ్య ([[ప్రకాష్ రాజ్]]) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు మరియు కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి రేలంగి మామయ్య. ఆ ఊరిలో అందరికీ రేలంగి మావయ్య అంటె ఎనలేని అభిమానం. అందరితో సంతోషంగా, ఆనందంగా బ్రతకాలనుకునే ఇతనికి పెద్దోడు ([[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]) మరియు చిన్నోడు ([[మహేష్ బాబు]]) అని ఇద్దరు కొడుకులు ఉంటారు. వీరిలో పెద్దోడు చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తలవంచుకునే వ్యక్తిత్వం కాదు. తనకు నచ్చింది చేసి మంచి అవకాశం కోసం చూసే వ్యక్తి, నిరుద్యోగి, తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. సీత ([[అంజలి (నటి)|అంజలి]]) అతనికి మరదలు. ఆ ఇంట్లో సీత చెయ్యలేని పనిలేదు, ప్రేమించబడని మనిషి లేడు. కానీ చిన్నప్పటి నుండి సీత ఎప్పటికి అయిన పెద్దోడే తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది. మరో ప్రక్క చిన్నోడు ఎటువంటి పరిస్థితిని అయినా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. చిన్నోడు తన బంధువుల పెళ్ళిలో పెళ్ళికూతురు చెల్లెలైన అయిన గీత ([[సమంత]])ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మామయ్య కుటుంబానికి సంపద తక్కువగా ఉందని గీత తండ్రి ([[రావు రమేష్]]) చులకనగా చూస్తుంటాడు.
 
ఇదిలా ఉండగా రేలంగి మావయ్య తన కూతురిని ఇంటికి తీసుకురావడానికి వైజాగ్ వెళ్తాడు. అక్కడ గీత అక్క, తన మొగుడు మరియూ అత్త మామలతో అదే ట్రైను ఎక్కుతుంది. ట్రైనులో ఒకే చోట కూర్చున్న వీరందరూ మాట్లాడుకుంటూ ఉండగా గీత అక్క వాళ్ళ అత్త మామలు తమ రెండో కొడుకుతో రేలంగి మావయ్య కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. గీత కుటుంబం విజయవాడలో ఉంటారు. గీత చనిపోయిన పెద్దనాన్న కూతురే సీత. మొదటి నుంచీ గీత తండ్రికి రేలంగి వారిపై సదాభిప్రాయం లేదు. అందులోనూ పెద్దోడికి కూడా వారిపై సదాభిప్రాయం లేదు.కాబట్టి ఆ సంభందానికిసంబంధానికి పెద్దోడు ముందు అంగీకారం తెలుపడు. కానీ చిన్నోడు నచ్చజెప్పాక ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు. వైభవంగ జరిగిన ఆ పెళ్ళిలో గీత తండ్రి మళ్ళీ రేలంగి వారి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతాడు. ఇది పెద్దోడిలో వారి పట్ల మరింత ద్వేషాన్ని నింపుతుంది.
 
పెళ్ళి జరిగిన మరుసటిరోజు హైదరాబాద్లో స్థిరబడ్డ ఆ ఊరి మనిషి పెద్దోడిని హైదరాబాద్ రమ్మని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. సాధారణంగా ఒకరి కింద పనిచేయడం ఇష్టంలేని పెద్దోడు చిన్నోడి మాట విని హైదరాబాద్ కి తనతో పాటు వెళ్తాడు. కానీ అక్కడ తనకి పరాభవం జరుగుతుంది. దానితో వేరే ఉద్యోగం వెతకాలని పెద్దోడు అనుకుంటాడు. ఇంతలో చిన్నోడు, గీత ల ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి గీత చిన్నోడిని ఒక హోటలుకు రమ్మంటుంది. కానీ అక్కడ తన పూర్తి కుటుంబం ఉన్నదన్న విషయాన్ని చెప్పదు. మళ్ళీ అక్కడ గీత తండ్రికీ, చిన్నోడికీ మధ్య అభిప్రాయభేదాలు వచ్చి చిన్నోడు అలిగి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న పెద్దోడు గీతతో చిన్నోడిని చూస్తాడు. ఆ రాత్రే పెద్దోడు చిన్నోడికి ఒక్కమాట చెప్పకుండా ఊరు వెళ్ళిపోతాడు. దీనివల్ల పెద్దోడికీ, చిన్నోడికీ మధ్య దూరం పెరుగుతుంది. ఇరువురి మధ్యగల దూరం వల్ల కలత చెందిన చిన్నోడు ఒకనాడు గీతతో గొడవపడి విడిపోతాడు. ఒకేసారి గీత, సీతలకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెడతారు వారి పెద్దలు.
 
ఇది ఇలా ఉండగా ఒకరిని కాపాడే ప్రయత్నంలో రేలంగి మావయ్యకు యాక్సిడెంట్ అవుతుంది. కానీ తొందరగానే తేరుకుంటాడు. రేలంగి మావయ్యను చులకనగా చుసే వాళ్ళంతా ఆయనకు దగ్గరవుతుంటే, అన్నదమ్ములిద్దరి మధ్య దూరం అలాగే మిగిలిపోయింది. ఇదంతా గమనిస్తూ వచ్చిన సీత ఒకనాడు రేలంగి మావయ్యతో భద్రాచలంలోని సీతారాముల కళ్యాణంకు వెళ్దామని అడుగుతుంది. వెంటనే అందరూ భద్రాచలం చేరుకుంటారు. అక్కడికి గీత కూడ అనుకోకుండా తన కుటుంబ సభ్యులతో చేరుకుంటుంది. అంతా సవ్యంగా జరుగుతున్నదనగా ఆ మండపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. తోటి భక్తుల సలహా మేరన చిన్నోడు బయటకు వెళ్ళి ట్రాన్స్ఫార్మరు బద్దలుకొట్టగా ఈలోపు పెద్దోడు గీతనీ తన తండ్రినీ, అక్కనీ తొక్కిసలాట నుంచి కాపాడుతాడు. పోలీసుల చర్యలు కూడ తోడవటంతో ప్రమాదం సద్దుమణుగుతుంది. అన్నద్ఫమ్ములిద్దరు తీరిగ్గ కూర్చుని కళ్యాణం చూస్తున్న తరుణంలో రేలంగి మావయ్య అక్కడికొచ్చి వారిద్దరినీ మెచ్చుకుంటూ, సాటి మనుషులతో ప్రేమగా ఉన్నప్పుడే అందరు ఆనందంగా ఉంటారని చెప్తాడు. రేలంగి మావయ్య మాటలు విన్న అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. పెద్దోడు కూడా సీత ను ప్రేమిస్తున్న విషయాన్ని సీతకు తెలియజేస్తాడు. పెద్దోడు సీతను పెళ్ళిచేసుకొవడం, చిన్నోడు గీతలు కలిసిపోవడం, గీత తండ్రి ప్రవర్తనలో మార్పు రావడం, అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలు సంపాదించడంతో కథ సుఖాంతమౌతుంది.
 
==తారాగణం ==
* [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] - పెద్దోడు
* [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]] - చిన్నోడు
*[[శ్రీనివాస రెడ్డి]]
* [[సమంత]] - గీత
* [[అంజలి (నటి)|అంజలి]] - సీత/సీతమ్మ