వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
[[దస్త్రం:Wiki-telugu first page print screen image.png|500px|right|thumb|తెలుగు వికీపీడియా మొదటి పేజి]]
== ప్రవేశిక==
వికీపీడియా అంటే అంతర్జాల విజ్ఞానభాండాగారం. పలువురు కలిసి విజ్ఞాన సమాచారాన్ని సేకరించి అంతర్జాలంలో ఒకచోట భద్రపరచడం. ఈవిధంగా భద్రపరచినదానిని అందరికీ ఉచితంగా వాడుకోవడానికి అనుమతించడం. విషయసేకరణ మరియు అది అందరికీ అందుబాటులో ఉంచడం అనే ప్రక్రియను నిరంతరంగా ప్రవహింపచేయడమే వికీపీడియా లక్ష్యం. ఈ ప్రక్రియను మొదలు పెట్టిన ఘనత జిమ్మీ వేల్స్ అనే అమెరికన్ కు చెందుతుంది. న్యూపీడియాకు అనుబంధంగా పనిచేస్తున్న వికీపీడియాకు అనూహ్య ఆదరణ లభించడంతో 2001 జనవరి 15 వ తేదీన వికీపీడియాగా అవతరించింది. విషయపరిజ్ఞానం ఉన్న సామాన్యులు సైతం పాల్గొని, తమకు తెలిసిన సమాచారాన్ని వ్యాసంగా తయారుచేసే అవకాశం కల్పించడంతోబాటు, ఆ విధంగా సంగ్రహించిన సమాచారాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వికీపీడియా అవతరించింది. వికీపీడియా లాభాపేక్షరహితంగా పనిచేస్తుంది కనుక దీనిలో ప్రకటనలకు కూడా తావులేదు. అవసరమైన నిధులను చందాల రూపంలో మాత్రమే సమకూర్చుకుంటుంది. వికీపీడియా ఊహ జిమ్మీవేల్స్ దైతే దానికి ఆచరణాత్మక రూపమిచ్చిన ఘనత లారీ సాంగరుకు దక్కుతుంది. వికీపీడియా రూపకల్పన చేయడానికి లారీసాంగర్ సాంకేతిక నిపుణుడైన "బెన్ కోవిడ్జ్ " సలహా సహకారాలను తీసుకున్నాడు. ఇందుకు అవసరమైన హార్డ్‍వేర్ ను డోమిన్బోమిస్ సంస్థ ఉచితంగా అందించింది. అంతే.... లభించిన ప్రాథమిక సౌకర్యాలతో శాండియాగోలో వికీపీడియా కార్యాలయం ప్రారంభమైంది. నవ్యచరిత్రకు అంకురార్పణ జరిగింది.
 
==వికీపీడియా ఆవిష్కరణ ==