వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
విజయ యుగాది 2013 సందర్భంగా పత్రికప్రచారపత్రిక ప్రచార సౌలభ్యం కొరకు పత్రికాశైలిలోపత్రికా శైలిలో వ్రాసిన వ్యాసం.<br />
 
ఒకే ఒక్క క్లిక్ తో ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని కంటి ముందు సాక్షాత్కరింపజేస్తున్న ఒకే ఒక్క మీడియా వికీపీడియా. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషలలో అంతర్జాల విజ్ఞాన సర్వస్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వికీపీడియా రేపటి తరాన్ని విజ్ఞాన సుగంధాలతో సుసంపన్నం చేస్తుందన్నది అక్షర సత్యం...! సమాచార విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్న నేపథ్యానికి సూత్రధారిగా అభివర్ణించదగిన వికీపీడియా ప్రారంభమై పుష్కర కాలం గడచినా... ''వికీపీడియా అంటే ఏమిటి?'' అనే సందేహం ఇంకా చాలామందిలో ఉండనే ఉంది. అక్షరజ్ఞానం కలిగిన ప్రపంచ జనావళికి అందుబాటులో ఉంటూ, అభ్యుదయ సాధనలో తనవంతు పాత్రను సేవాభావంతో నిర్వహిస్తున్నదే వికీపీడియా...! పన్నెండేళ్ళ కిందట ఆంగ్లభాషలో ఆరంభమైన వికీపీడియా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్కొక్క భాషను కలుపుకుంటూ నిరవరోధంగా సాగుతూ ప్రపంచంలోని ప్రతి ప్రధాన భాషలో వికీపీడియా తన ప్రభావాన్ని వెదజల్లుతూ నేటికి 285 భాషలకు విస్తరించి, తన విజయయాత్ర కొనసాగిస్తుండగా.... ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ అనంతరం మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబుతోంది.