భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి యను నది కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినను. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయము లగు చారిత్రికాధారములు కానరావు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానా విధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెననియు నొక ప్రతీతి కలదు. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. అది యటుండనిండు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి యతనికి జీవితమున నాశా భంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మ దృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో గొన్నింటిని పేర్కొందము.
==అయన గూర్చి వివిధ గ్రంథములలో విషయములు==
* పూర్వ సంఘటనలను తెలియజేసిన ఒక గ్రంథములో భర్తృహరి భార్య పేరు [[అనంగసేన]] అని యున్నది.
* ఇంకొక గ్రంథనగ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యును గా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.
* భర్తృహరి భార్య [[పద్మాక్షి]] అని యింకొక కథ కలదు.
* భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అథికారియై దానిని తనసోదరుడుతన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాధ.
* చంద్ర గుప్తుడనుచంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
* మరియొక గాథ ననుసరించి విక్రమాదిత్యునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలు నలువురు భార్య లనియు, వారియందు వరరుచి, విక్రమార్క, భట్టి, భర్తృహరులు జన్మించినారని తెలిసినది.
 
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు