"వట్టివేరు" కూర్పుల మధ్య తేడాలు

==చల్లదనానికి వట్టి వేర్ల ఉపయోగము==
చల్లదనానిని వట్టి వేర్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగె కిటికీలకు, ద్వారలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలు కొంతకాలం తర్వాత అందులో బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన కూడ వస్తుంది. కాని వట్టి వేర్ల చాపలు వేసినందున వాటినుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాల కాలంవరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి.
==భూసార పరిరక్షణకు==
భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడ వట్టి వేర్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాల లోతు వరకు వెళ్తాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారాన్ని పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడ అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకె క్రిమి కీటకాలను దరిచేరనీయదు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.
 
ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటినిలోని కలుషితాన్ని శుబ్రపరచి భూమిని, నీటిని శుబ్రపరచగలము. మరియు ఈ గడ్డి వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, కాగితం తయారికి కూడ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేర్లు చాల ఉపయోగము.
 
==పుట్టుక==
ఖస్ ఖస్ గా పిలువబడే ఈ గడ్డి జాతి పుట్టుక భారత దేశమే. కాని దీని నుండి తీసె పరిమళ తైలం మరియు ఇతరత్రా ప్రయోజనాల కొరకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పెంచు తున్నారు. ఇతర దేశాలలో తయారయ్యే అన్ని రకాల పరిమళాలలో వట్టి వేర్ల తైలం తప్పక కలుపుతారు. ఇన్ని కారణాల వల్లి వట్టి వేర్లను ప్రస్తుతం విరివిగా పెంచు తున్నారు.
 
[[వర్గం:పోయేసి]]
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/828266" నుండి వెలికితీశారు