కర్నూలు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==చరిత్ర==
ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం 'కందెనవోలు'. 11వ శతాబ్దిలో 'ఆలంపూరు' లో ఆలయం కట్టడానికి బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో ఈ ప్రాంతంలో బండి చక్రాలకు 'కందెన' రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి 'కందెనవోలు' అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.
 
బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనంలోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయలి కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడిలోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన 'కొండారెడ్డి బురుజు' అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.
 
1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్ధీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో నవాబు అయిన హిమాయత్ ఖాన్ 'కర్ణాటక యుద్ధాలు'గా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, వారి హయాంలోనికి వచ్చింది.
 
1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ 'బుస్సీ' (పిల్లల పాటల్లోని 'బూచాడు') కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో 'టిప్పు సుల్తాన్' మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఇప్పటి రాయలసీమ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు, ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.
 
[[18వ శతాబ్ధం]] లో కర్నూలు అర్ధ స్వత్రంత్రుడైన [[పఠాన్‌ నవాబు]] యొక్క [[జాగీరు]] లో భాగముగా ఉండేది. ఈ నవాబు యొక్క వారసున్ని [[1838]] లో బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో [[బనగానపల్లె]] సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది.[[1947]]లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది.బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. [[1953]]లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి [[ఆంధ్ర రాష్ట్రము]] ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. [[1956]]లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు [[హైదరాబాద్ రాష్ట్రము]]లో భాగమైన [[తెలంగాణ]] ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి [[హైదరాబాదు]]ను రాజధానిగా చేశారు.
"https://te.wikipedia.org/wiki/కర్నూలు_జిల్లా" నుండి వెలికితీశారు