సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

36 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[తిరుమల]] లో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడ అంటారు. [[శ్రీమహావిష్ణువు]] శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, మరియు వేంకటాద్రి. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
 
పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
 
'''ఉపోద్ఘాతము'''
[[భగవంతుడు]] పంచాత్మ స్వరూపుడని [[తైత్తరీయ ఉపనిషత్తు]] పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం [[పర]], [[వ్యూహ]], [[విభవ]], [[అంతర్యామి]], [[అర్చావతారం|అర్చావతారాలలో]] చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే [[శ్రీకృష్ణుడు]], [[శ్రీరాముడు]] వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన [[ఆళ్వారు|ఆళ్వార్లు]] తమ '[[నలయీర దివ్యప్రబంధా]]'లలో ప్రస్తుతించారు.
 
ఈ నూటెనిమిది దివ్యదేశాలూ [[శ్రీవైష్ణవమతం|శ్రీవైష్ణవమత]] సంప్రదీకులకు పరమ పవిత్రస్థలాలు. ఇవి భారతదేశమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో 106 క్షేత్రాలు భూలోకంలో ఉండగా, రెండు పరలోకంలో([[వైకుంఠం]], [[క్షీరాబ్ది]]) ఉన్నాయని భావన. ఈ 106 దివ్యక్షేత్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి రెండే రెండు. అవి... [[తిరుమల]] ([[తిరుపతి]]), [[అహోబిలం]].
12

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/82910" నుండి వెలికితీశారు