ఆంధ్ర నాటక కళా పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నాటకరంగం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
+{{వికీకరణ}}
పంక్తి 1:
{{వికీకరణ}}
సురభి నాటక సమాజాధినేత వనారస గోవిందరావు, సురభి నాటకానికి దేశ విదేశాలలో ప్రదర్శన అవకాశాలు కల్పించి విస్తృత ప్రచారం చేసిన సురభి సమాజ ఆవిర్భవించిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు చరిత్ర పుటల్లో గణనీయమైన స్థానాన్ని పొంది, తెలుగు నాటకరంగాన్ని అనేక మలుపులు తిప్పి చైతన్యాన్ని సృష్టించింది.
మూకీ చలన చిత్రాలు, తెలుగు టాకీ చిత్రాలు విరివిగా వెలువడుతూ తెలుగు నాటకాన్ని, నాటక రంగ ప్రాశస్త్యాన్ని అణగదొక్కి వెనక్కునెట్టివేస్తున్న రోజుల్లో నాటకరంగావశ్యకతను, దాని ప్రశస్తిని నిలబెట్టి ముందంజ వేసేందుకు తగిన ప్రోత్సాహం, సహాయ నహకారాల కోసం తాను పడే తపనను లక్ష్మయ్య తన యజమాని గోవిందరావుకు తెలిపాడు. ఆయన అంగీకారం తెలపడంతో, తన తపనను విజ్ఞప్తి రూపంలో దేశంలో ఆనాటి ప్రసిద్ధ పండితులు, కళాకారులు, నాటకాభిమానులు, కళాపోషకులు, అందరికీ తెలిపి వారందరినీ ఒకచోట చేర్చేందుకు కృ షి చేశాడు. ఆ కృషి ఫలితంగానే 1929, జూన్ 19, 20, 21 తేదీలలో తెనాలి పట్టణంలో సురభివారి నాటక ప్రదర్శనశాలలో ప్రప్రధమంగా ఆంధ్ర నాటక కళా పరిషత్తు పేరిట ఒక సంస్థ ఆవిర్భావం, మూడు రోజులపాటు మహాసభలు జరిగాయి.