"ఎస్.పి.కోదండపాణి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం [[గుంటూరు]] లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. [[అద్దేపల్లి రామారావు]] చిత్రం [[నా ఇల్లు]] చిత్రంలోలో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణామూర్తి]] వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. [[1955]] లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.
 
హాస్యనటుడు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో [[కన్నకొడుకు]] చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత [[పదండి ముందుకు]] (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.
 
[[పద్మనాభం]] చిత్రం [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] ద్వారా వీరుఇతను 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశాడు.
 
==చిరకాలం గుర్తుండే పాటలు==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/831975" నుండి వెలికితీశారు