వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 269:
 
===సభ్యుల,ముఖ్యుల పరిచయాలు===
ముందుగా మల్లాది కామేశ్వరరావుగారు సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన శ్రీరామకృష్ణ రామస్వామి గారిని, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ నిర్వహకులు శ్రీ పెద్ది రామారావు, CIS A2K ప్రాజెక్ట్ డైరెక్టర్ విష్ణువర్ధన్, వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అధ్యక్షులు అర్జునరావు, వికీపీడియా నిర్వాహకులు సుజాత, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు ఆసక్తి జట్టు అద్యక్షులు రహ్మానుద్దీన్ గార్లను వేదికనలంకరించమని ఆహ్వానించారు తదనంతరం వెన్న నాగార్జున గారి సందేశం వీడియో ప్రదర్శించబడింది. నాగార్జున గారు తెవికీలో తను నిర్వహించిన పాత్ర గురించి,తెలుగు చరిత్ర, సంస్కృతి గురించి ముందు తరాలకు తెలియచెప్పడానికి తెలుగు వికీపీడియా సరియైనదని, కొత్తపదాల సృష్టిగురించి శ్రమపడకుండా విజ్ఞానసర్వస్వాన్ని విస్తరించాలని సందేశమిచ్చారు. తరువాత రామకృష్ణ రామస్వామిగారు మాట్లడుతూ విద్యార్ధులకు వికీపీడియా వుపయోగం గురించి తెలియచెప్పడానికి తమసహాకారం ఎళ్లవేళలా వుంటుందని వాగ్ధానం చేశారు. జిమ్మీవేల్స్ ఉపన్యాసం విని తాను ప్రభావితమై ఒకప్పుడు వికీపీడియా సభ్యుడుగా పాలుపంచుకొన్న రోజులను గుర్తుచేసుకున్నారు. విష్ణువర్థన్ చాలా ఆసక్తికరంగా విజ్ఞానసర్వస్వ చరిత్ర వివరించుతూ దీనిలో అందరు పాల్గొనాలని కోరారు. అర్జున తన వికీపీడియా అనుభవాలను గుర్తు చేసుకుంటూ తెలుగు వికీపీడియా ఈ మహోత్సవం జరుపుకొనడం తనకెంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. ఈ మహోత్సవం స్ఫూర్తితో తెవికీ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. వికీ పరిచయం, వికీ సభ్యుల పరిచయాలతో కూర్చిన వీడియోలు ప్రదర్శించారు.
 
 
<సభ్యులు మీరూ ఒక చేయి వేయండి>