జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q208855 (translate me)
పంక్తి 3:
== పూర్వరంగం ==
=== మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం ===
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ వారి భయానికి విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి ఆ యుద్ధంలో సహాయపడటం ద్వారా వారి నుంచి స్వాతంత్ర్యం పొందాలని వారి ఆలోచన. యుద్ధానికి భారతీయ సైన్యాలను పంపించి వారికి సాయం చేశారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు [[యూరోపు]], [[ఆఫ్రికా]], మధ్య ప్రాచ్య దేశాల్లో తమ సేవలందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. కానీ బెంగాల్, మరియు [[పంజాబ్]] లలో మాత్రం వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో ఉగ్రవాద తరహా దాడులు, పంజాబ్ లో నానాటికీ పెరుగుతున్న అశాంతీ ఆయా ప్రాంతీయ పరిపాలనా విభాగాలను ఇరుకున పెట్టాయి. <ref name=Gupta12>{{Harvnb|Gupta|1997|p=12}}</ref><ref>{{Harvnb|Popplewell|1995|p=201}}</ref> ఈ యుద్ధం ప్రారంభం నుంచే [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లోనూ, [[కెనడా]], [[జర్మనీ]]లలో ఉంటున్న కొద్దిమంది భారతీయులు బెర్లిన్ కమిటీ, మరియు గదర్ పార్టీ నేతృత్వంలో, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మరియు, జర్మన్, [[టర్కీ]]ల సహకారంతో [[1857]] సిపాయిల తిరుగుబాటు తరహాలోనే ఉద్యమం లేవదీయాలని చూశారు. దీన్నే హిందూ జర్మన్ కుట్ర అని కూడా అంటారు. <ref name=Strachan798>{{Harvnb|Strachan|2001|p=798}}</ref><ref name=Hoover252>{{Harvnb|Hoover|1985|p=252}}</ref><ref name=GBrown300>{{Harvnb|Brown|1948|p=300}}</ref> దీనిలో భాగంగా [[ఆఫ్ఘనిస్తాన్]] ను కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నించారు.<ref name=Strachan788>{{Harvnb|Strachan|2001|p=788}}</ref> బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు విఫల యత్నాలు చేశారు వీటిలో గద్దర్ కుట్ర, మరియు సింగపూర్ కుట్ర ప్రధానమైనవి. కానీ ఈ ఉద్యమాలు విస్తృతమైన గూఢచార సమాచారంతో, కఠినమైన రాజకీయ శాసనాలతో అణచివేయడం జరిగింది. ఈ చట్టాలు దాదాపు పదేళ్ళపాటు అమలులో ఉన్నాయి<ref name=Hopkirk41>{{Harvnb|Hopkirk|2001|p=41}}</ref><ref>{{Harvnb|Popplewell|1995|p=234}}</ref>
 
=== యుద్ధం తరువాత ===