పావగడ: కూర్పుల మధ్య తేడాలు

paavagada
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[==పావగడ]]==
 
మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలో ని పావగడ లో వున్నది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ది నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడ కొంత వైవిద్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట వున్నది.
 
[[==మరొక పావగడ]]==
గుజరాత్ రాష్ట్రంలో బరోడాకు సుమారు యాబై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వున్నది. ఇక్కడ [[కాళీ మాత]] ఆలయం చాల ప్రసిద్ది పొందినది. ఈ ఆలయాన్ని [[విశ్వామిత్రుడు]] నిర్మించాడని, విగ్రహాన్ని కూడ తనే ప్రతిష్టింఛాడని భక్తుల విస్వాసం. ఈ పర్వతం పై విశ్వామిత్రునికి ఒక [[ఆశ్రమం]] వున్నది. కొండ దిగువన వున్న నదిని కూడ ఆయన పేరునే పిలుస్తారు. ఎత్తైన కొండపై వెలసిన ఈ ఆలయానికి వెళ్లడానికి ఐదు కిలోమీటర్ల దూరం మెట్ల దారి లో వెళ్లాలి. అమ్మవారి విగ్రహం రక్త వర్ణం లో విప్పారిన నేత్రాలతో బయంకర రూపం కలిగి వున్నది. మూల విరాట్ కు ఒక వైపున పాలరాతి విగ్రహం, మరొక వైపు పాలరాయి పై చెక్కిన శక్తి యంత్రం దర్శనమిస్తాయి. దశరా నవరాత్రులలో ఈ క్షేత్రం భక్తులతో కిట కిట లాడు తుంది. నవ రాత్రుల సమయాన భక్తులు మట్టి కుండల్లో నవదాన్యాలను మొలకెత్తించి తొమ్మిది రోజులు పూజిస్తారు. ఎనిమిదో రోజున తొమ్మిది మంది రుత్త్విజులతో నవ చండీ యాగాన్ని నిర్వహించి పదో రోజున ఈ కుండలను ఆలయ సమీపంలో [[దుదియా తలావ్]] అనే నరస్సులో నిమజ్జనం చేస్తారు. ఈ సరస్సులోని నీరు పాల లాగ తెల్లగా వుంటుంది. ఈ సరస్సు నుండే సోపాన పంక్తి అనగా మెట్లదారి ప్రారంబం అవుతుంది. కొండ పైకి వెళ్లడానికి ఉయ్యాల మార్గంకూడ వున్నది. కొండ శిఖరానికి దిగువున భద్ర కాళి ఆలయం వున్నది. ఇందులోని విగ్రహం దక్షిణ ముఖంగా వుండగా ఎగువన వున్న ఆలయంలోమహాకాళి మూల విరాట్ ఉత్తరాభిముఖంగా వున్నది. ఈ ప్రాంతం కొంత కాలం ముస్లింల పాలనలో వున్నందున ఇక్కడ అనేక ముస్లింల కట్టడాలు వున్నాయి. [[మహాకాళి]] ఆలయానికి చేరువలో వెయ్యేళ్ల నాటి [[లకులీశ్]] మందిరం వున్నది. ఇది జీర్ణావస్తలో వున్నందున ప్రభుత్వం పునర్ నిర్మిస్తున్నది.
 
( మూలం: ఈనాడు ఆదివారం: 15 డిసెంబరు 2002)
 
==మూలాలు==
* ( మూలం: ఈనాడు ఆదివారం: 15 డిసెంబరు 2002)
 
 
[[వర్గం:మహారాష్ట్ర]]
[[వర్గం:మహారాష్ట్ర పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పావగడ" నుండి వెలికితీశారు