కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==సాహిత్యంలో==
కిన్నెరసాని నది వృత్తాంతాన్ని వర్ణిస్తూ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''కిన్నెరసాని పాటలు'' అనే కవితాసంపుటాన్నికవితా సంపుటాన్ని వ్రాశాడు. ఇది 1925లో ''కోకిలమ్మ పెళ్లి''తో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది.
 
కిన్నెరసానీ! ఊహలోనైనా కాస్త నిలువమని ఆమె భర్త ప్రాధేయపడుతున్నాడు.
తనప్రియురాలైన కిన్నెరసాని నిలువెల్ల కరిగిపోయి తన హృదయాన్ని, తన ప్రాణాన్ని హరించి అదృశ్యమైందని అతడు ఆవేదన చెందాడు.
భర్తగా ఒకవేళ తప్పుచేసినా, ఏ స్త్రీలైనా ఇంత కఠినులుగా ఉంటారా! అని అతడు ఆమెను ప్రశ్నించాడు.
స్త్రీలెవరైనా లోకంలో ఇంతకోపం ,ఇంత పట్టుదల కైలిగి ఇలా చేస్తారా! అని అతడు అడిగాడు.
శోకమూర్తివైన నిన్ను కౌగిలించుకున్నాను అయినా ఇంతలో నీరైపోయావా! అంటే భర్తగా కిన్నెరసానిని ఓదార్చాలని ప్రయత్నించే లోపలే ఆమె జీవం కోల్పోయిందని అర్ధం.
ఎంతో కోపం ఎంతోపగ ఉన్నా తనను శిక్షించడానికి వేరే మార్గం లేదా అని అతడు ఆవేదన చెందాడు.
రాతి మీద కాలుపెట్టలేని సుకుమారి కిన్నెరసాని కరిగినీరై కొండల్లో గుట్టల్లో ఎలా ప్రవహించగలదని ఆమె భర్త అమె సౌకుమార్యన్ని గురించి ఆలోచించాడు.
ఆమె పాతివ్రత్యాన్ని గురించి ప్రశించలేదు అలాంటి ఆలోచన తనకు ఉంటే తనకత్తితో గొంతుకోసుకుంటానని అతడు ఆమె పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు.
కిన్నెరసాని ప్రవాహంలోని నురుగు వెన్నెలవలె తెల్లనై ఆమె సుందరమైన శరీరఛాయ వలె ఉందని అతడు భావించాడు.
సెలయేటి రూపంలో మెలికలుగా ప్రవహిస్తుంటే ఆమె ఒయ్యారపు నడకలు అతనికి గుర్తుకు వచ్చాయి.
సెలయేటి నురుగులు ఆమె నవ్వులుగా, అలలు ఆమె శరీరపు ముడతలుగా, చేపలు ఆమె కన్నులుగా అతడు వర్ణించాడు.
ఆమె మడికట్టును ఇసుకతెన్నెగా జూచిన అతని కళ్ళు పరితపించాయి
పూర్వం భగీరథుని వెంట పరుగెత్తిన ఆకాశగంగ వలె ఆమె ప్రవాహం ఉన్నదని అతడు ప్రశంసించాడు.
ఆమె జడ పట్టుకోవలని ప్రయత్నించిన అతని చేతికి నీటి ప్రవాహం తగిలింది.
ఎడమ చేతితో కొంగుపట్టుకోవాలనుకుంటే అతని చేతికి తడి తగిలిందికాని కొంగుదొరకలేదు.
అతని నుదుటి మీద చెమట ఇలా వాగుగా మారిన అమెపై ప్రేమను ప్రకటిస్తున్నది.
ఆమె అతని జీవితానికి విలువైనది, ప్రాణాధారమైనది, శిరోరత్నం వంటిది అని అతడు పేర్కొన్నాడు.
ఆమె ఆ విధంగా మారినపుడు అతని శరీరంలో ప్రాణాలు నిలువవని చెప్పి తానుకూడ ప్రవాహంలాగే మారుతానని చెప్పాడు.
ఆమె రసహృదయ కాబట్టి ప్రవాహంలాగా మారింది కాని తాను కఠినహృదయుడు కాబట్టి ప్రవాహంలాగే మారలేనని తెలిపాడు.
నది మనిషిగా మారినదేమొ అని అతడు అమె కన్నులు జూచి అనుకున్నాడు.
పరుగెత్తిపోతున్న కిన్నెరసాని అలలకదలికలో ఆమె యవ్వన సంపదను అతడు వీక్షించాడు.
ఆమెను కౌగిలించుకున్నప్పుడు కలిగినపుకింత అతనిని వీడక ముందే ఆమె కిరిగినీరై కనిపించకుండా పోయింది.
అడవులో ఏడుస్తూ తిరుగుతున్నా అతనికి నీదే నీదే తప్పని వాదించినట్లనిపించింది.
చేతులు చాచి , గొంతెత్తి ఏడుస్తున్నా అమె వినిపించుకోవటంలేదని అతడు ఆవేదన చెందాడు.
ఆమె కొరకు ఏడ్చి ఏడ్చి అతని గొంతు పూడుకొని పోయింది . కన్నీరు అడ్డంపడి కంటిచూపు మందగించింది. శరీరం గట్టిపడింది.
ఏడ్చే రోదనలో తనను తాను మర్చిపోయిన అతని దేహం రాయిగా మారిపోయింది.
కిన్నెరా వరదగా ప్రవహించింది. అలలతో పరుగులు పెట్టింది.
కిన్నెరసాని ఉధృతమై, సుళ్ళు తిరుగుతూ నురుగులు కక్కింది.
రాళ్ళ మీద పచ్చిక మీద, పయనించిన కిన్నెరసాని సుడులతో మోగింది. ఒడ్డులను వొరుసుకుంటూ ప్రవహించి సుళ్ళుతిరిగిన ఆ ప్రవాహం మెలికలు తిరిగింది.
కిన్నెరసాని అలల వరుసలతో మెరిసింది . సుడుల ముడులతో వేగంగా నడిచింది. ఇసుకనేలపైన బుసబుస పొంగింది.
కిన్నెరసాని లేళ్ళ సమూహంలాగా, పూలనదిలాగ, పడగవిప్పిన తెల్లత్రాచులాగా కనిపించింది.
తొడిమవూడిన పూవులాగ, సిగ్గుపడిన రాకుమార్తె లాగ, అందం కోల్పోయిన రత్నపేటికలాగ కనిపించింది.
కిన్నెరసాని తనభర్త రాయిగా మారిన బోటనే అతనిని విడిచిపెట్టలేక దిగులుగా తిరిగింది.
కిన్నెర తాను నదిగా మారినందుకు ఎంతో బాధపడింది. ముక్తగీతం వలె ఆమె బాధ మోగింది. ఆమె ఒకచోట నిలువలేక పరుగులు పెట్టింది.
ఏ ఉపాయంతోనైనా మళ్ళీ మనిషిగా మారితే బాగుండుననే కోరికను ఆపుకోలేక విలపించింది కిన్నెరసాని . అంటే ఆమె తన భర్తప్రేమకు చలించిపోయి తన తొందరపాటుకు పశ్చాత్తపడిందని అర్ధం.
తనను విడిచి ఆమెభర్త జీవీంచలేడని ఆమె బ్రతికుండగా గ్రహించలేకపోయింది. అది తెలిసి ఉంటే అతనితో ఎంతో ప్రేమగా ఉండే దాన్నని కిన్నెరసాని ఎంతో వెలపించింది.
అటువంటి భర్తతో కాపురాన్ని ఇలా నాశనం చేసుకున్నానని కిన్నెర ఎంతో దిగులుపడింది.
చివరికి ఏమీ చేయలేక కిన్నెరసాని రాయిగా మారిన భర్తను తన అల్లలు అనే చేతులతో చుట్టి ఎంతో వ్యధచెందింది.
కొండగా మారిన భర్తను మాటిమాటికి కిన్నెర చేతులతో కౌగిలించి అలలమోతతో పలుకరించింది.
తన భర్తను కూడ నదిగా మారిపొమ్మని కిన్నెర కోరింది. జలరూపంలో ఇద్దరం కలిసి పోదామని కెరటాలతో కౌగలించుకుందామని పేర్కొన్నది.
ఓ నాథ! ఇలాంటి తప్పు ఇంక చేయను . నీవు ఆఙ్ఞాపిస్తే అడుగుదాటను. మరుజన్మలో ఇంతకోపం తెచ్చుకోను అని కిన్నెరసాని భర్తతో చెప్పింది.
తాను కలత చెందానని , శ్రమతో అలసిపోయానని కిన్నెరసాని చెప్పింది.
చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పి కిన్నెరసాని రాయిగా మారిన తనభర్తను విడిచివెళ్ళిపోయింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు