"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
===[[వేప చెట్టు]]===
ఈచెట్టు ''[[మెలియేసి]]'' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త నామం:అజడిరక్ట ఇండికా (Azadirachta Indica). సంస్కృతంలో నింబ, హిందిలో నీం, గుజరాత్‍లో లిండొ, మహరాష్ట్రలో కుడులింబొలి, దక్షిణ భారతంలో వేప అని పిలుస్తారు.భారతదేశమంతా వ్యాప్తిచెందివున్నది. బయలుప్రదేశాలలో, ఇంటి ఆవరణలలో, అడవుల్లో పెరుగుతుంది. వేపచెట్టు పెరిగే ఇతరదేశాలు,దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండోమలయని ప్రాంతము. భారతదేశంలో, ఆంధ్ర, గుజరాత్, మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, హిమచల ప్రదేశ్. అస్సాము, మరియు అండమాన్ నికోబార్ దీవులలో వేప విసృతం గా పెరుగుతుంది. ఒకచెట్టునుండి ఏడాదికి 37-55 కిలోలవరకు నూనెగింజలను సేకరించెవీలున్నది. వేపగింజల సేకరణ ఉత్తరభారతంలో జూన్-జూలై మధ్యకాలంలో, దక్షిణాన మే-జూన్ నెలలో చేస్తారు. వేపకాయలో (Dry fruit)నూనె 20% వరకుంటుంది. వేపగింజలనుండి '''[[వేపనూనె]]''' తీయుదురు. వేపగింజలను ఎక్సుపెల్లర్లను నూనెతీయుయంత్రాల ద్వారా, మరియు సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో తీయుదురు.
 
'''వేపనూనె'''= ప్రధానవ్యాసం'''[[వేపనూనె]]''' చూడండి.
===[[కానుగ చెట్టు]]===
ఈ చెట్టు ''[[ఫాబేసి]]'' కు చెందిన చెట్టు. వృక్షశాస్తనామం: పొంగమియా పిన్నట పెర్రె (ponagamia pinnata perre). సంస్కృతంలో కరంజ్, హింది మరియు ఉత్తరభారతంలో కరంజ, తమిళంలో పొంగం, ఇంగ్లిసులో ఇండియన్ బీచ్ (Indian beach) అని పిలుస్తారు. పశ్చిమఘాట్ లో విస్తారమధికం. నదుల ఒడ్దులలో, ఆవరణలలో, బయలు ప్రదేశాలలో, అడవుల్లో విస్తరించి వున్నది. భారతదేశంలో ఆంధ్ర, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, మరియు ఉత్తరప్రదేశ్ లలో బాగా వ్యాప్తిచెందివున్నది. ఒకచెట్టునుండి ఏడాదికి 50-90 కిలోలగింజలను సేకరించు అవకాశమున్నది. విత్తనం(kernel)లో నూనెశాతం 27-39% వరకుండును. గింజలనుండి ''' [[కానుగ నూనె]]''' ను ఎక్సుపెల్లరులద్వారాను ,మరియు కేకునుండి సాల్వెంట్ విధానంలో సంగ్రహించెదరు.
 
''' కానుగ నూనె'''= ప్రధాన వ్యాసం ''' [[కానుగ నూనె]]''' చూడండి.
===[[చింత చెట్టు]]===
ఈ చెట్టు '''[[ఫాబేసి]]''' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్రనామము:టమారిండస్ ఇండికా.సాధారణ పేర్లు:మరాఠీలో చించ్(chich);మలయాళం లలో పులి(puli);కన్నడలో హూలి;బెంగాలి,గుజరాతిలలో అమ్లి;హింది,పంజాబిలలో ఇమ్లి/చించ్‍పాల/తింతిదిక(tintidika).చింతచెట్లు బయలుప్రదేశాలలో పెరుగును.బాటలకిరువైపుల పెంచెదరు.కొన్నొచోట్ల గుంపుగా చింతతోట/తోపులుగా పెంచెదరు.మైదాన ప్రాంతాలంతా వ్యాప్తి కలదు.దేశంలో ఆంధ్ర,బెంగాల్,బీహరు,మహరాష్ట్ర,కర్నాటక,ఒడిస్సా మరియు హిమాలయ దిగువపరిసర ప్రదేశాలలో వ్యాపిచెంది వున్నది.చింత పిక్కల నుండి '''[[చింతపిక్కల నూనె]]''' తీయుదురు. చింతపిక్కలో 7-8% వరకు నూనె లభించును.
 
'''చింతపిక్కల నూనె'''= ప్రధానవ్యాసం '''[[చింతపిక్కల నూనె]]''' చూడండి
===[[గుగ్గిలం కలప చెట్టు]]===
దీనిని తెలుగులో తంబచెట్టులేదా సర్జకాము అనికూడా అంటారు.వృక్షశాస్త్రనామము:షొరియ రొబస్టా(shorea robusta).ఇది [[డిప్టెరోకార్పేసి]] (Dipterocarpaceae)కుటుంబానికి చెందిన చెట్టు.ఇంగ్లిషులో సాక్(sal)అంటారు.సంస్కృతంలో అశ్వకర్ణ,హిందిలో సాల్/సాఖు,కేరళలో మరమరం,తమిళంలో కుగ్గిలము,కర్నాటకలో కబ్బ,ఓడిస్సాలో సాల్వ,/సేక్వ అనిపిలుస్తారు.ఇది అడవుల్లో పెరిగే చెట్టు.భారత దేశంలో అస్సాం,బీహారు,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,నేపాల్ మరియు దక్కను పీఠభూమిప్రాంత అడవుల్లో విస్తారంగా వ్యాపించివున్నది.సాల్ గింజలనుండి తీసిన నూనెనూ'''[[సాల్‌సీడ్ నూనె]]''' అంటారు.
 
'''సాల్‌సీడ్ నూనె'''= ప్రధానవ్యాసం '''[[సాల్‌సీడ్ నూనె]]'''చూడండి.
===కొకుమ్ చెట్టు===
ఈచెట్టు[[ గట్టిఫెరె]] (Guttiferac)కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామము:గర్సినియ ఇండికా చొయిసి(Garcinia indica choisy).భారతదేశంలో వ్యవహారిక పేర్లు:సంస్కృతంలో రక్తపురక్,హిందిలో కొలిమ్,కర్నాటకలో మురుగల,కేరలలో పునముపులి,తమిళనాడులో మురుగల్,గుజరాతిలో కొకుమ్,మహరాష్ట్రలో బిరుండ్/కొకుమ్/రతంబ,ఒడిస్సాలో తింతులి మరియు ఆంగ్లంలో వైల్డ్ మాంగొస్టెన్/రెడ్ మాంగొస్టెన్.ఆవాసం:వర్షాయుత పశ్చిమ కనుమల ప్రాంతాలైన మైసూరు,కూర్గ్,వైనీడ్,ఖసి,మరియు జైంతల కొండలు మరియు తూర్పు కనుమలో బెంగాల్,అస్సాం,మరియు అందమాన్ నికోబార్ దీవులు.నూనెను '''[[కొకుం నూనె]]'''అందురు.
 
'''కొకుం నూనె'''= ప్రధానవ్యాసం '''[[కొకుం నూనె]]''' చూడండి
===[[మామిడి]]చెట్టు===
మామిడి చెట్టును ఆంగ్లంలో మ్యాంగో(mango)అంటారు.తీపిరుచి కలిగిన ఫలాలనిచ్చును.వృక్షశాస్త్రనామము:మాంగిఫెర ఇండిక లిన్(Mangifera indica linn).ఇది [[అనకార్డియేసి]](anacardiaceae) కుటుంబానికిచెందిన చెట్టు.మామిడిపండులోని మృదువైన తీపిగుజ్జులోన గట్టి టెంక(shell)కలిగిన మామిడి విత్తనం/పిక్క వుండును.మామిడి పిక్కలో6-8% వరకు నూనె వుండును.మామిడిపిక్కలనుండి తీసిన నూనెను '''[[మామిడిపిక్కనూనె]]''' అందురు.ఈనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వుండటం వలన గదిఉష్ణోగ్రతవద్ద ఘనస్ధితిలో వుండును.భౌతిక,రసాయనలక్షణాలు కొకో బట్టరును పోలివుండును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/837243" నుండి వెలికితీశారు