"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

'''కొకుం నూనె'''= ప్రధానవ్యాసం '''[[కొకుం నూనె]]''' చూడండి
===[[మామిడి]]చెట్టు===
మామిడి చెట్టును ఆంగ్లంలో మ్యాంగో(mango)అంటారు.తీపిరుచి కలిగిన ఫలాలనిచ్చును.వృక్షశాస్త్రనామము:మాంగిఫెర ఇండిక లిన్(Mangifera indica linn).ఇది [[అనకార్డియేసి]](anacardiaceae) కుటుంబానికిచెందిన చెట్టు.మామిడిపండులోని మృదువైన తీపిగుజ్జులోన గట్టి టెంక(shell)కలిగిన మామిడి విత్తనం/పిక్క వుండును.మామిడి పిక్కలో6-8% వరకు నూనె వుండును.మామిడిపిక్కలనుండి తీసిన నూనెను '''[[మామిడిపిక్కనూనె]]''' అందురు.ఈనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వుండటం వలన గదిఉష్ణోగ్రతవద్ద ఘనస్ధితిలో వుండును.భౌతిక,రసాయనలక్షణాలు కొకో బట్టరును పోలివుండును.
 
'''మామిడిపిక్కనూనె'''=ప్రధాన వ్యాసం '''[[మామిడిపిక్కనూనె]]'''చూడండి.
===ధూప చెట్టు /[[ధూప దామర]]===
ధూప చెట్టు యొక్క వృక్షశస్త్రనామం:''వెటెరియ ఇండిక లిన్''(veteria indica linn).ఈచెట్టు [[డిప్టెరోకార్పేసి]](dipterocarpaceae)కుటుంబానికి చెందినది.
ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలొపైలం ఇనొపైలం(calophyllum inophyllum.linn).ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప,మహరాష్ట్రలో యుండి(Undi)అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను '''[[పొన్ననూనె]]''' అందురు.
===అడవిఆముదం చెట్టు===
అడవిఆముదం గుంపుగా కొమ్మలు కలిగిన పొదవంటి చెట్టు.3-4 మీటర్ల ఎత్తు పెరుగును.తెలుగులో 'నేపాలం',ఉండిగాపు అనికూడా వ్యవహరిస్తారు.వృక్షశాస్తనామం:జట్రొఫా కురికస్(Jatropha curcas).ఈచెట్టు [[యుఫోర్బియేసి]] కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో పలురకాలున్నాయి.ఈ చెట్లు బాటలపక్కన,బయలు నేలల్లో,పొలంగట్ల వెంట,అడవలపాద ప్రాంతాలలో కనిపిస్తాయి.ఈ చెట్టు గింజలనుండి తీసిన నూనెను''' [[అడవిఆముదం నూనె]]''' లేదా '''[[జట్రొఫా నూనె]]''' అనిఅంటారు.
 
''' అడవిఆముదం నూనె'''= ప్రధాన వ్యాసం ''' [[అడవిఆముదం నూనె]]''' చూడండి.
===[[బాదం]]చెట్టు===
బాదం(Almond)చెట్టు[[ రోసేసి]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామం:ప్రునస్ డుల్సిస్(prunus dulcis).బాదంకాయలోని బాదంపప్పు మంచిపౌష్టిక,పోషకవిలువలను కలిగివున్నది.బాదంపప్పు నుండి తీసిన నూనెను '''[[బాదం నూనె]]'''అందురు.
 
'''బాదం నూనె'''= ప్రధాన వ్యాసం '''[[బాదం నూనె]]'''చూడండి.
===పిలు చెట్టు(Pilu)/[[జలచెట్టు]]===
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.గింజలనుండి తీసిన నూనె '''[[పిలు నూనె]]'''.
 
'''పిలు నూనె'''= ప్రధాన వ్యాసం'''[[పిలు నూనె]]'''చూడండి.
===హహొబ(jojoba)చెట్టు===
పొదవంటి ఈచెట్టు మూలం మెక్సికోలోని సొనొరన్(sonoran)ఏడారి.ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే చెట్టు.అంతేకాదు సారవంతంకాని భూములలో,పొడినేలలో,చవిటి నేలలలో,అధిక ఉష్ణొగ్రత వున్న ప్రాంతాలలోకూడా పెరుగుతుంది.భారతదేశంలో 60వ దశకంలో IARI(Indian arid region )ద్వారా ప్రవేశపెట్టబడినది.IARI ప్రస్తుతపేరుNBPGR(National Bureau and Genetic Resources). ఆసంస్థ ఆద్వర్యంలో పలుకేంద్రాలు రాజస్థాన్,గుజరాత్,మహరాష్ట్ర మరియు హర్యానా లలో పనిచేస్తున్నాయి.ఉచ్చారణ హహోబ అనివున్నను అక్షరాలలో 'jojoba'అనివ్రాస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/837256" నుండి వెలికితీశారు