అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q3518406 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Akkamahadevi_Udathadi1.JPG|thumb|right|ఉడుతడిలోని అక్కమహాదేవి విగ్రహం.]]
[[దస్త్రం:Akkamahadevi_Udathadi.JPG|thumb|right|అక్క మహాదేవి జన్మస్థానంలో మరొక శిల్పం.]]
[[దస్త్రం:Akka mahadevi diety idol at akka mahadevi caves, srisailam.jpg|thumbnail|శ్రీశైలంకి దగ్గరలో గల అక్కమహాదేవి గుహల వద్ద గల అక్క మహాదేవి విగ్రహం ]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ([[కన్నడ]] : ಅಕ್ಕ ಮಹಾದೇವಿ) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి [[కర్ణాటక]]లోని [[షిమోగా]] సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశం జరిగాయి.
 
పంక్తి 12:
 
అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. ఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోగల [[జ్యోతిర్లింగం]]లో ఐక్యం కావడం మంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతికాలంలోనే ఆమె శ్రీశైల మల్లిఖార్జునిలో ఐక్యమైపోతుంది.
[[దస్త్రం:Akka maha devi caves, srisailam.jpg|thumbnail|అక్కమహాదేవి గుహలు]]
 
 
అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో ''అక్కగళపితికే'', ''కొరవంజి వచనార్ధ'' అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటిరాగలవి.
"https://te.wikipedia.org/wiki/అక్క_మహాదేవి" నుండి వెలికితీశారు