ఇబ్రాహీం కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764168 (translate me)
పంక్తి 24:
1543లో ఇబ్రహీం సోదరుడు, [[జంషీద్ కులీ కుతుబ్ షా]], తండ్రిని చంపి, సోదరుని కళ్ళు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసులో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], దేవరకొండ కోట నుండి తప్పించుకొని [[బీదర్]] చేరుకుని [[అలీ బరీద్]] ఆశ్రయంలో కొన్నాళ్లున్నాడు. ఇబ్రహీం ఏనుగులను, ధనాన్ని కొంత అలీ బరీద్ కాజేయటంతో ఇద్దరి మధ్య అభిప్రాయలేర్పడి, ఇబ్రహీం [[విజయనగర సామ్రాజ్యము|విజయనగరానికి]] చేరుకొని [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించాడు. అక్కడ ఏడేళ్ల పాటు రాజ అతిధిగా జీవించాడు.<ref>[http://books.google.com/books?id=v4UKJFLZVcEC&dq=ibrahim+vijayanagar&q=ibrahim#v=onepage&q=ibrahim%20vijayanagar&f=false Mohammad Quli Qutb Shah, Volume 216 By Masʻūd Ḥusain K̲h̲ān̲]</ref> రామరాయలు ఇబ్రహీం కులీకి ఒక జాగీరును కూడా ఇచ్చాడు. రామరాయల భార్య ఈయన్ను సొంత కొడుకుగా భావించి షెహజాద్ అని పిలిచేది. విజయనగరంలో ఉండగా [[తెలుగు భాష]]పై అభిమానం పెంచుకున్నాడు. తరువాత తన పాలనాకాలంలో తెలుగు భాషను ఆదరించి, కవులను పోషించాడు.
 
[[దస్త్రం:Portrait of Ibrahim Qutb Shah.JPG|thumbnail|ఇబ్రహీం కులీ కుతుబ్ షా చిత్రపటం]]
==రాజ్య సంక్రమణ==
[[1550]]లో [[జంషీద్ కులీ కుతుబ్ షా]] మరణించిన తర్వాత ఏడు సంవత్సరాల బాలుడు సుభాన్‌ను రాజు చేశారు. రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ''ఐనుల్ ముల్క్''‌గా [[అహ్మద్‌నగర్]] నుండి సైఫ్ ఖాన్‌ను గోల్కొండకు పంపించారు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు.