కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Kanchi_Kamakshi_temple22.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Magog the Ogre. కారణం: (Copyright violation: Copyright Pavan Srinath, 2010. All rights res...
పంక్తి 45:
=== కామాక్షి దేవాలయం ===
[[దస్త్రం:Kamakshi.jpg|thumb|left|కంచి కామాక్షి అమ్మవారు]]
 
[[దస్త్రం:Kanchi Kamakshi temple22.jpg|right|thumb|200px|కామాక్షి ఆలయ గోపురం]]
[[పార్వతి]]దేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. [[ఆదిశంకరులు]] ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. [[మధుర]] మీనాక్షి, [[తిరువనైకవల్]] లో ఉన్న అఖిలాండేశ్వరి, [[కాశీ]]లో ఉన్న [[విశాలాక్షి]] దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో [[చెఱకు]]గడ, మరియు [[తామర (పువ్వు)|తామర]] పుష్పాన్ని మరియు [[చిలుక]]ను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి [[మన్మధుడు|మన్మధుని]]లో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే [[ఆదిశంకరాచార్యులు]] అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆతర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.<ref>[http://www.srikanchikamakshi.org/kanchi-temple.htm కామాక్షి దేవాలయం వెబ్ సైటు నుండి]</ref>
 
"https://te.wikipedia.org/wiki/కాంచీపురం" నుండి వెలికితీశారు