ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

కథ సంపూర్ణంగా రాయబడింది
తారాగణం జతచేయబడింది
పంక్తి 27:
ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై ఘట్టమనేని మంజుల నిర్మాతగా [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథాచిత్రం '''''ఏ మాయ చేశావే'''''. [[అక్కినేని నాగ చైతన్య]], [[సమంత]] ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహ్మాన్]] సంగీతం అందించారు. ఫిబ్రవరి 26, 2010న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాగ చైతన్య, సమంతలకు తొలి తెలుగు విజయవంత చిత్రం గా నిలిచిపోయిన ఈ సినిమా నేటికీ తెలుగులో వచ్చిన అమర ప్రేమకథాచిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది.
 
కార్తీక్ అనే యువ అసిస్టంట్ డైరెక్టరుకీ, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మళయాళ క్రిష్టియన్ అమ్మాయికీ మధ్య నడిచిన ప్రేఅమాయణాన్నీ, ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపధ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో శింబు, [[త్రిష]] ముఖ్య పాత్రల్లో ఈ సినిమా "విన్నైతాండి వరువాయా" పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా నటవర్గం, పతాక సన్నివేశం ఏ మాయ చేశావే సినిమాకి పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. కానీ ఈ సినిమా హింది పునః నిర్మాణమైన ఏక్ థా దీవానా మాత్రం పరాజయం చవి చూసింది.
 
==కథ==
పంక్తి 36:
అంతా సాఫీగా జరుగుతుండగా పూరీ జగన్నాధ్ గోవాలో షూటింగ్ కి తన యూనిట్ తో కలిసి వెళ్తాడు. 45 రోజులు సాగే ఈ షూటింగ్ లో కార్తీక్ కూడా ఒక భాగం. షూటింగ్ జరుగుతుండగా జెస్సీ ఇంట్లో తన పెళ్ళి గురించి చర్చలు జరుగుతుంటాయి. దానితో భయపడిపోయి జెస్సీ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. తను షూటింగ్ లో పాల్గొంటున్న లొకేషన్లలో సిగ్నల్స్ లేక పోవడం, దర్శకుడైన పూరీ జగన్నాధ్ సెట్స్ లో ఫోన్ల వాడకం నిషేదించడం వల్ల ఇప్పుడు మాట్లాడలేనని, తిరిగి వచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ కట్ చేస్తాడు. దానితో జెస్సీ తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనీ, తమ ఇద్దరి జీవిత లక్ష్యాలు వేరనీ చెప్పి కార్తీక్ తో విడిపోతుంది. తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని తెలుసుకుని నివ్వెరబోతాడు కార్తీక్.
 
రెండేళ్ళ తర్వాత తనతో పాటు అసిస్టంట్ గా పనిచేసిన నందిని తనని ప్రేమిస్తున్నానై కార్తీక్ తో చెప్తుంది. ఇంకా జెస్సీని మర్చిపోని కార్తీక్ తన ప్రేమని సున్నితంగా తిరస్కరించి, స్నేహితునిగా మిగిలిపోతాడు. పూరీ జగన్నాధ్ దగ్గర పనిచేసిన తర్వాత తన ప్రేమ కథను సినిమాగా తెరకెక్కించాలని పూనుకుంటాడు కార్తీక్. ఇందుకోసం తన పాత్రకు ప్రముఖ తెలుగు నటుడు శింబును, జెస్సీ పాత్రకు ప్రముఖ నటి త్రిషను[[త్రిష]]ను ఎంచుకుని వారిచే ఒప్పిస్తాడు. పతాక సన్నివేశం లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమాకి జెస్సీ అని పేరు పెడతాడు కార్తీక్. న్యూయార్క్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మళ్ళీ జెస్సీని కలుసుకుంటాడు కార్తీక్.
 
జెస్సీకి పెళ్ళైందని నమ్ముతున్న కార్తీక్ ఇంకా తను నిన్నే ప్రేమిస్తున్ననని జెస్సీతో చెప్పకనే చెప్తాడు కార్తీక్. కానీ జెస్సీ తనకి ఇంకా పెళ్ళి కాలేదనీ, కార్తీక్ తో తన పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఆ పెళ్ళి ఆపుకుని, తన తల్లిదండ్రులకు దూరమయ్యానని చెప్తుంది. ఏం జరిగినా వారిద్దరూ పెళ్ళి చేసుకుని కలిసి బ్రతకాలని నిశ్చయించుకుని చర్చిలో, గుడిలో ఒకే రోజు పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో జెస్సీ సినిమా చూస్తుండటంతో కథ సుఖాంతమౌతుంది.
 
==తారాగణం==
* ముఖ్య తారాగణం
** [[అక్కినేని నాగ చైతన్య]] - కార్తీక్
** [[సమంత]] - జెస్సీ
** [[కృష్ణుడు (నటుడు)|కృష్ణుడు]] - కార్తీక్ స్నేహితుడు
** సంజయ్ స్వరూప్ - కార్తీక్ తండ్రి
** దేవన్ - జెస్సీ తండ్రి
* అతిథి పాత్రలు
** సపన్ సరన్ - నందిని
** [[పూరీ జగన్నాధ్]] - పూరీ జగన్నాధ్ (నిజజీవిత పాత్ర)
** [[గౌతమ్ మీనన్]] - గౌతమ్ మీనన్ (నిజజీవిత పాత్ర)
** శింబు - శింబు (నిజజీవిత పాత్ర)
** [[త్రిష]] - త్రిష (నిజజీవిత పాత్ర)
** ఘట్టమనేని సుధీర్ బాబు - జెస్సీ అన్నయ్య
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు