అంతరిక్షం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
(తప్పులు సరి చేసి ఈ వాక్యాన్ని తొలగించగలరు)
 
[[అంతరిక్షం]] అనంతమైన త్రిపరిమాణాత్మక ప్రదేశము. భూవాతావరణ కక్ష్యకు అవతల ఉన్న, హద్దులు లేని అనంతమైన భాగాన్ని అంతరిక్షం (స్పేస్) అంటారు. ఫలానా చోట భూవాతావరణం అంతమై, అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం. అంతరిక్షం దగ్గరౌతున్నకొద్దీదగ్గరవుతున్నకొద్దీ, వాతావరణం కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావరణంలోని ముప్పావుభాగం భూమిచుట్టూ 11 కి.మీ.లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు, భూమి ఉపరితలానికి 120 కి.మీ.ల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సందర్భాలలో, కార్మాన్ రేఖను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు, ఇది భూమి ఉపరితలానికి 100 కి.మీ.ల దూరంలో నెలకొని ఉంటుంది. ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే [[విశ్వము]] అంటాం. అంతరిక్షంలోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షంలోని ప్రతీ అణువు ఏ చోటకు వెళ్ళినా, దానిలోని శక్తులు ఒకే విధముగా ఉంటాయి. భౌతిక అంతరిక్షాన్ని తరచుగా మూడు సరళ పరిమితులుగా పేర్కొంటారు. అయితే ఇదే సమయంలో ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఈ అనంతమైన భాగాలను నాలుగు అవిభక్త (క్వాంటినం) పరిమాణాలనుపరిమాణాల (డైమెన్షనల్) అంతరిక్షకాలం (స్పెస్ టైం) అంటున్నారు. గణితశాస్త్రంలో, "స్పేస్" పరిమాణాలను, వివిధ సంఖ్యలు మరియు వివిధ అంతర్లీన నిర్మాణాలతో పరీక్షించారు. భౌతిక విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు, సైద్ధాంతిక ప్రాముఖ్యత కలిగిన అంతరిక్ష భావనను పరిగణిస్తారు.
 
అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి [[రాకేశ్ శర్మ]]. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138 వ వాడు. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు.
"https://te.wikipedia.org/wiki/అంతరిక్షం" నుండి వెలికితీశారు