"రామా చంద్రమౌళి" కూర్పుల మధ్య తేడాలు

Minor formatting changes
(Minor formatting changes)
==రచయిత పరిచయం:==
రామా చంద్రమౌళి (rama chandramouli)
రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు 8-7-1950లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్‌(మెకానికల్‌) ఎఫ్‌.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు.
వీరు ప్రొఫెసర్‌గా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా వరంగల్‌ గణపతి ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్నారు.
 
==రచనలు:==
ఇప్పటి వరకు 192 కథలు, 18 నవలలు, ఎనిమిది కవిత్వ సంపుటాలు, ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు, శాస్త్రీయ విద్యా విషయక వ్యాసాలు, ఇంజినీరింగ్‌ పాఠ్యగ్రంథాలు రాశారు.
 
ఇంజినీరింగ్‌ పాఠ్యపుస్తకాలు: 1. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, 2. డిజైన్‌ ఆఫ్‌ మెకానిక్‌ ఎలక్ట్రానిక్స్‌ 3. ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, 4. ఇంజినీరింగ్‌ మెటాలజీ, 5. సాలిడ్‌ మెకానిక్స్‌ తదితర పుస్తకాలు రచించారు
 
==పొందిన పురస్కారాలు:==
 
రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్‌ టీచర్‌ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం(1986) నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాఅలిటెక్నిక్‌ అధ్యాపక అవార్డు (2000),భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం(2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది.
‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్‌ఫెర్నో’ మూలగ్రంథం ‘అరతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది. జి.ఎం.ఆర్‌. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008),
 
==ముఖ్యమైన ఘట్టాలు:==
 
వీరి సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె.యాదగిరి నేతృత్వంలో రామాచంద్రమౌళి - సమగ్ర సాహిత్యం పరిశోధన అంశంపై జ్వలితచే పి.హెచ్‌.డి చేస్తున్నారు.
'ఎడారిలో చంద్రుడు' (నవల), 'చదరంగంలో మనుషులు' కన్నడంలోకి అనువదించబడ్డాయి. 8 కథలు కన్నడంలో టెలీ కథలుగా ప్రసారం చేయబడ్డాయి. దాదాపు 20 కథలు ఇంగ్లిష్‌, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి అనువదించబడ్డాయి.
 
===ఇంగ్లీషులోకి అనువాదమైన కవితా సంపుటాలు:===
 
‘ఎటు..?’ అన్న కవితా సంపుటిని ప్రొ కె. పురుషోత్తం, ప్రొ ఎస్‌. లక్ష్మణమూర్తి, డా వి.వి.బి. రామారావు, రామతీర్థ, డా కేశవరావు, డా కె. దామోదర్‌ రావు కలిసి ‘విథర్‌ అండ్‌ అందర్‌ పోయయ్స్‌’గా ఒక సంపుటి వెలువరించారు. ‘కిటికీ తెరిచిన తర్వాత’ సంపుటిని డా కె. పురుషోత్తం, డాఎస్‌. లక్ష్మణమూర్తి, డా లంకా శివరామ ప్రసాద్‌, రామతీర్థ ఇత్యాదులు ‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’ పేరుతో వెలువరిస్తే, అది అమెరికాలో ‘ఆటా’ పక్షాన నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభ’ల్లో కాలిఫోర్నియా వేదికపై ఆవిష్కరించారు. ‘అంతర్దహనం’ కవిత్వ సంపుటిని స్వాతి శ్రీపాద ‘ఇన్‌ఫెర్నో’ పేరుతో మొత్తం పుస్తకాన్ని అనువదించి వెలువరించారు. లంకా శివరామప్రసాద్‌ ‘ఫైర్‌ అండ్‌ స్నో’గా వెలువరిస్తున్నది నాల్గవ సంపుటి.
1,488

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/838890" నుండి వెలికితీశారు