సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
*సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?.
సగ్గి బియ్యం తయారికి ముడి సరుకు [[కర్ర పెండలమ]]. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుబ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. గతంలో ఈపనిని స్త్రీలు చేసే వారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుబ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్దతిలోనే ఈ దుంపలనుండి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో - పాలు లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఈ పిండిని వివిద రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి బాల్సు జల జలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం <ref>మూలం: ఆది వార ఆంధ్ర జ్యోతి 3 జూన్, 2012.</ref>
 
మూలం: ఆది వార ఆంధ్ర జ్యోతి 3 జూన్, 2012.
 
==మూలాలు==
{{Reflist}}
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు