ద్రావిడ నిర్మాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దక్షిణ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన నిర్మాణ శైలి ద్రావిడ నిర్మాణం. [[ద్రావిడ భాషలు]] మాట్లాడే [[ద్రావిడ ప్రజలు]] ఈ నిర్మాణాలను నిర్మించడం వలన వీటిని '''ద్రావిడ నిర్మాణాలు''' అని పిలుస్తున్నారు. ఇవి ప్రధానంగా పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉన్న దేవాలయాలు, తమిళంలో వీటిని కోవెలలు అంటారు. కఠినమైన రాతి శిలలను చెక్కి దేవాలయ రూపాన్ని సృష్టించడానికి ఈ నిర్మాణాలలో అనేక దేవతల, యోధుల, రాజుల, మరియు నర్తకుల విగ్రహాలను పొందు పరిచారు. పురాతన పుస్తకం వాస్తు శాస్త్ర లో దేవాలయ నిర్మాణం యొక్క మూడు శైలులు ఒకటిగా చెప్పబడింది, ఇది ప్రధానంగా తమిళనాడు ప్రాంతంలో ప్రారంభమైంది. ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ లలో అధిక భాగం నిర్మాణాలు ఉన్నాయి. అనేక ఇతరులతో పాటు చోళులు, చేర, పాండ్య, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, హోయసలులు, మరియు విజయనగర సామ్రాజ్యం వివిధ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు కాలక్రమంలో ద్రావిడ నిర్మాణకళ యొక్క వికాసానికి విశేష కృషి చేశారు. ఇంకా ద్రావిడ శైలి నిర్మాణం ఉత్తర భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, మరియు ఆగ్నేయ ఆసియా యొక్క వివిధ భాగాలను ప్రాంతాల్లో చూడవచ్చు.
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ద్రావిడ_నిర్మాణం" నుండి వెలికితీశారు