మందుముల నరసింగరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| source =
}}
[[పాలమూరు జిల్లా]]కు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన '''మందుముల నరసింగరావు''' [[మార్చి 17]], [[1896]]న ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]] [[చేవెళ్ళ]]లో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రికకువార్తాపత్రిక వ్యవస్థాపకస్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు<ref>పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 151</ref>. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు ([[నిజామాబాదు]])లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు. [[మార్చి 12]], [[1976]]న మందుముల మరణించాడు.
==ఇవి కూడా చూడండి==
*[[50 సంవత్సరాల హైదరాబాదు (పుస్తకం)]]
"https://te.wikipedia.org/wiki/మందుముల_నరసింగరావు" నుండి వెలికితీశారు