అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అద్దంకి శ్రీరామమూర్తి''' ([[1898]] - [[1968]]) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు మరియు సంగీత విశారదులు.
 
వీరు [[గుంటూరు జిల్లా]] [[కల్వకుర్తి]] గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారు. [[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత రాజమండ్రిలోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారు. బి.టి.రాఘవాచార్యుల వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన ధర్మారాజు మరియు దశరథుని పాత్రలకు పేరొందాడు. పాండవ ఉద్యోగ విజయం నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవాడు. పసుపులేటి కన్నాంబ సరసన హరిశ్చంద్రుని పాత్రకుగాను మంచిపేరు తెచ్చుకున్నాడు.
 
తన తొలి సినిమా, [[పసుపులేటి కన్నాంబ]] సరసన [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] సినిమాలో హరిశ్చంద్రుని పాత్రకుగాను మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటి దాకా హరిశ్చంద్ర పాత్రలో డి.వి.సుబ్బారావు, హరిప్రసాదరావులను చూడ్డానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశాడు.
 
చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటులుగా కీర్తి సంపాదించారు. వీరు ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవారు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించాడు.
Line 14 ⟶ 16:
*[[భోజ కాళిదాసు]] (1940)
*[[మహానంద]] (1939)
*[[సారంగధర]] (1937) - రాజరాజ నరేంద్రుడు
*[[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] (1935) - హరిశ్చంద్ర
 
==బయటి లింకులు==