అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 35 interwiki links, now provided by Wikidata on d:q194486 (translate me)
చిన్న మార్పు
పంక్తి 1:
'''అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల''' (International Alphabet of Sanskrit Transliteration), అనునది సంస్కృత అధారితములైన భారతీయ లిపులను దోషాలు లేనివిధంగా రోమనీకరించడానికి ఉపయోగించు లిప్యంతరీకరణ విధానము. అ.సం.లి.వ [[సంస్కృతం]] మరియు పాళీ భాషలలోని గ్రంథాలను రోమనీకరణ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశపు మతాలకు సంబంధించిన ప్రచురణలలోనూ, వ్యాసాలలోనూ దీనిని వాడుతున్నారు. ఏకసంకేత ఖతులు విస్తారంగా లభ్యమౌతున్న కారణాన, అంతర్జాలంలో దీని వాడకం ఎక్కువగుతున్నది.
 
అయితే సంస్కృత, పాళీ భాషలను ఒకే పుటలో వ్యక్తపరచడానికి ఇది సరిపోవడం లేదు. ఇక్కడ ఏకసంకేత ఖతులు మరియు ISO 15919లను వాడవచ్చును. 1894 సంవత్సరం జెనీవాలో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓరియంటలిస్ట్స్ ఏర్పరిచిన ప్రమాణం మీద అ.సం.లి.వ ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా సంస్కృతమే కాక, ఇతర భారతీయ లిపులను కూడా లిప్యంతరీకరించవచ్చును. అదే విధంగా, కోల్‌కత రోమనీకరణకై జాతీయ గ్రంథాలయం ( National Library at Kolkata romanization) ఇతర భారతీయ భాషలలో రోమనీకరణని అనుమతించడానికి ఉద్దేశించినది.