నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయి తో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు వున్నది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావు ను తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణ లో కూడ ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషన్ లో విచారణ సమయంలో మనారాయణ రావుని నీవు హిందువువా మిస్లిం వా , నీ పేరేమిటని అడగ్గా హిందు/ ముస్లిం తేడా తెలియకుండా వుండ డానికి తన పేరు "బాబు" అని అన్నాడు. కాని పోలీసులు నారాయణ రావు బట్టలన్నీ వూడ దీసి అతను హిందువని నిర్దారించారు. ఇంతలో [[నైజామ్]] ప్రధాని [[మీర్ లాయక్ అలి]] అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేసించి "నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక [[సర్దార్ పటేల్|సర్దార్ పటేలా?]] " అని ప్రశ్నింఛాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు పోలీసులు. ఆ మరు దినం ఎదురు సెల్ గదిలో [[గండయ్య]] వున్నాడు. అతను అద్దెకు తీసుకున్న సైకిల్ పైన వున్న పేరును బట్టి దాని ఆదారంతో పోలీసులు గండయ్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాతి తెలిసింది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్దారణకు, అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదిని చూపగా అతడు తన కొడుకే నని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి తన కొడుకు ఇంత పని చేశాడని కోప్పడలేదు, కొట్టలేదు, అసహ్యించు కోలేదు. కొడుక్కి అంతా మంచి జరుగు తుందని, దేవుడు రక్షిస్తాడని, దైర్యం చెప్పాడు కొడుక్కు. నారాయణ రావు తన కేసును వాదించ డానికి ఏ వకీలును నియమించు కోలేదు. తన కేసును తనే వాదించు కున్నాడు. విచారణ సమయంలో నారాయణ రావు తండ్రి వచ్చి నప్పుడు మిఠాయి తెచ్చి ఇచ్చే వాడు. దైర్యం చెప్పేవాడు. నారాయణ రావు విచారణ సందర్బంలో తను తయారు చేసుకున్న ప్రతిజ్ఞా పాటాన్ని మళ్లి, మళ్ళి చెప్పేవాడు. నారాయణ రావు తండ్రి తనయుడి విడుదల కొరకు, పండరి నాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్ కు [[ఉరి శిక్ష]] విధించింది. అపుడు నారాయణ రావు పవార్ గర్వంగా "సర్ కటా సక్తే హై లెకిన్ స్ర్జుఆ సక్తే నహీ" అని[[ పండిత రాం ప్రసాద్ బిస్మిల్ల]] కవిత చరణాలను బిగ్గరగా పాడుకున్నాడు. ..................................................కాని...............
1948 సంవత్సరం, సెప్టెంబరు 17 న [[నిజాము నవాబు]] [[వల్లబాయి పఠేల్]] ముందు లొంగి పోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్ లో విలీనం అయి పోయింది. ఆ తర్వాత నారాయణరావు పవార్ ను అతని అనుచరులకు ఇతర కేసులలో వున్న నిందితులకు క్షమాబిక్ష లబించింది......................... ఇంతటి ధీరోదాత్త సంఘటనకు తగు ప్రచారం లబించ లేదు. (మూలం: ఆంధ్ర జ్యోతి ఆదివారం. 23 జనవరి; 2011)
{{తెలంగాణ విమోచనోద్యమం}}
 
 
[[వర్గం:1926 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/నారాయణరావు_పవార్" నుండి వెలికితీశారు