సవరణ సారాంశం లేదు
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14:
;పూజలు:
ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో [[సూర్య పూజోత్సవము]] మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చినది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస , సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.
;ఆలయ విశేషాలు:
ఈ ఆలయ ప్రధాన గోపురమందున్న ద్వారము అతి విశాలముగా నున్నది. దానిపైనుండిన గోపురము కూలిపోగా.... తి.తి.దేవస్థానం వారు కొత్తగా గోపురాన్ని నిర్మించారు. కనుక ఇది చిన్నదిగానున్నది. ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో రెండు గోపురములు కలవు. అవి ఆనాటివైనందున శిధిలావస్థలో నున్నందున ఇనుప స్తంభాలతో భద్రపరిచారు. [[బొమ్మ చూడండి]] ఈ ప్రాకారంలో కొబ్బరి తోట, పూల తోటలు ఉన్నాయి. మరెటువంటి కట్టడాలు లేవు. ఈ ఆవరణంలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని చూడ వచ్చు. ఆ తరవాత రెండో గోపురము తో చుట్టబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయమున్నది. అందులోనే కళ్యాణ మండపము, ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాకారంలో నుండి గర్భాలయం లోనికి వెళ్ళవచ్చు. చాల దూరంలో స్వామి వారి మూల విరాట్టు ఉన్నది. మూల విరాట్టు పాదభాగము మత్స్య రూపంలో ఉండగా, శంఖు, చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించ వచ్చు. ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణము ఉన్నది. అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తులతో అలారారు తున్నవి. గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గము.
[[దస్త్రం:Vedanarayana swamy temple board at nagalapuram .jpg|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆలయ వివరాలను తెలిపే బోర్డు]]
[[దస్త్రం:Top of the gopuram of vedanarayana temple at nagalapuram4.JPG|thumb|right|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం ఎడమ ప్రక్కనున్న గోపురము పైభాగము]]
ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడా కూలి పోయినందున తిరిగి నిర్మించి ఉన్నారు. (బొమ్మ చూడుము) ప్రధాన గోపురాల లోని శిల్ప కళ చాల అద్భుతంగా ఉన్నది. ప్రతి రోజు పర్యటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు తిరుపతి నుండి నాగలాపురమునకు నడుపబడు చున్నవి.
;ఆలయ విశిష్టత:
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి [[సూర్య పూజోత్సవాలు]] జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
|