వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
;ఆలయ విశిష్టత:
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి [[సూర్య పూజోత్సవాలు]] జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
 
==[[అప్పలాయగుంట ... ప్రసన్న వేంకటేశ్వరాలయం, చిత్తూరు జిల్లా.]]==
[[దస్త్రం:Board. appalayagunda temple5.JPG|thumb|left|అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న, ఆలయ వివరాలు తెలిపే బోర్డు]]
[[దస్త్రం:Appalaayagunta s.v. temple9.JPG|thumb|right|అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయం ప్రధాన గోపురం]]
అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
;స్థల పురాణం:
శ్రీ వేంకటేశ్వరుడు........ [[నారాయణ వనం]] లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ [[[అప్పలాయగుంట]] లో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని [[అగస్తేశ్వరు]] ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న [[శ్రీనివాస మంగా పురం]] లో ఆరునెలలు ఉండి అక్కడి నుండి [[శ్రీవారి మెట్టు]] ద్వారా (నూరు మెట్ల దారి) [[తిరుమల]] చేరాడని స్థల పురాణం.
 
ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉన్నది.
[[దస్త్రం:Appalayagunta tank7.JPG|thumb|right|అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయ కోనేరు, దీనికి అవతలనున్నది ఆంజనేయ స్వామి ఆలయం]]
[[దస్త్రం:Aanjaneya temple infrong appalayagunta venkateswara temple0.JPG|thumb|left|అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న ఆంజనేయ స్వామివారి ఆలయం.]]
ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణములో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.
 
;ఈక్షేత్రానికి ఎలా వెళ్ళాలి?
అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడ ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.
;మూలం: స్వయంసందర్శనం : ఆలయ ప్రాంగణంలో నిలిపిన ఆలయ వివరాలు తెలిపే బోర్డు.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/846327" నుండి వెలికితీశారు