వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడ ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.
;మూలం: స్వయంసందర్శనం : ఆలయ ప్రాంగణంలో నిలిపిన ఆలయ వివరాలు తెలిపే బోర్డు.
 
== పద్మావతి అమ్మవారి ఆలయము. అలమేలుమంగా పురం, తిరుపతి ==
[[దస్త్రం:Padmavathi Ammavaru.jpg|thumb|right| అలమేలు మంగ/ పద్మావతి అమ్మవారు]]
[[దస్త్రం:Padmavathi Ammavari Temple.JPG|thumb|left|పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన గోపురం]]
[[దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru. tirupati.JPG|thumb|centre|పద్మావతి అమ్మవారి కోనేరు]]
పద్మావతి అమ్మ వారి ఆలయము తిరుపతి సమీపంలో ని తిరుచానూరు లో వున్నది. దీనిని అలమేలు మంగా పురమని కూడ అంటారు.
ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.
 
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి వారికి కూడ ఆలయాలున్నాయి.
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. తిరుచానూరులో వున్న పద్మావతి అమ్మవారి కోనేరు చాల విశాలమైనది. అందులోని నీరు చాల స్వచ్చంగా వుంటాయి. అమ్మ వారికి తెప్పోత్సవం ఈ కోనేరులోనె వైభవంగా జరుగు తుంది. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.