వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వీది నాటకాలు]]
గతంలో...... పల్లెల్లో ప్రజలు వినోదార్తం వీది నాటకాలు వేసే వారు. లేదా నాటకాలు వేసె వారిని రప్పించి ఆడించే వారు. ముఖ్యంగా భారతం లో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీది నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. నాటకం లోని స్త్రీ పాతలను కూడ మగ వారె వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని [[ఒద్దిక]] అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, బజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడ ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒకవేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు.
పల్లెల్లోని ఔత్చాహికులు వేషాలు వేయడానికి చాల ఆరాట పడే వారు. ముఖానికి రంగు లేసుకోవాలంటే వారికెంత ఇష్టమో చెప్పలేము. ప్రేక్షకులు కూడ వారిని ఆవిధంగానె ఆదరించే వారు. ఎక్కువగా [[మహాభారతం]] లోని ఘట్టాలను, వీధి నాటకాలుగా వేసేవారు. వీరు కాకుండా నాటకాలు వేయడమే వృత్తి గా వున్న బృందాలు అక్కడక్కడా వుండేవి. వారిని పిలిపించి తమకు కావలసిన నాటకాన్నీ వేయించి ఆనందించేవారు. ప్రస్తుత కాలంలో ఈ వీధినాటకాలు చాల వరకు కనుమరుగైనాయి. కేవలం పల్లెవాసులు ఇప్పుడు మొఖాలకు రంగులేసుకోవడం లేదు. కాని వృత్తిగా నాటకాలేసే వారిని పిలిపించి [[మహాభారత]] ఘట్టాల నాటకాలు సుమారు ఇరవై రోజుల పాటు ఆడిస్తున్నారు. ఇందుకొరకు కొన్ని గ్రామాలకు కలిపి అక్కడ పంచపాండవుల విగ్రహాలున్న ఆలయాలున్నవి. అక్కడ ఈ భారతం జరుగుతుంది. ఇది ఒక పెద్ద జాతర లాగ రాత్రి పగలు కూడ జరుగుతుంది. పగలంతా మహాభారత ఘట్టాలను హరికథ రూపంలో కథ చెప్పితే అదే ఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. అదీ కేవలం చిత్తూరు జిల్లాలో జరిగినప్పుడు ఈ నాటకాలు వేస్తున్నారు. అది కూడా పేరు మోసిన నాటక కంపెని వారి చేత వేయిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం మొఖానికి రంగు లేసుకోవడం లేదు.
 
 
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు