పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
===నాటకాలు===
;[[మహా భారత నాటకాలు]] ఇది సుమారు ఇరవై రోజులు జరుగు తుంది.( భారతంలోని ఘట్టాలను 18 రోజులే జరుగు తాయి. మిగతా రెండు రోజులు వేరె నాటకాలు జరుగు తాయి) పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. ఇది బహు జనాధరణ పొందింది, ఇది అన్ని పల్లెల్లో జరగదు. ద్రౌపతీ సమేత పంచ పాండవుల ఆలయం వున్న వూర్లల్లోనె రెండు మూడు ఏండ్ల కొక సారి జరుగుతుంది. ఆ సందర్బంలో అక్కడ జరిగే [[తిరునాళ్లు]] ప్రజలకు పెద్ద వినోధం. ఈ ఇరవై రోజుల్లో మూడు నాలుగు ప్రధాన ఘట్టాలుంటాయి. ద్రౌపది వస్త్రాపహరణ, బక్కాసుర వధ, అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, కృష్ణ రాయ బారం ,చివర ధుర్యోధన వధ. వీటిలో పగలు కూడ జరిగే ఘట్టాలు మూడు. అవి.... 1. బక్కాసుర వధ, 2. అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 3. ధుర్వోధనుని వధ.
ప్రతి రోజు పగలు భారతంలొని ఒక ఘట్టాన్ని [[హరి కథ]] రూపంలో చెప్తారు. అదే ఘట్టాని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. బక్కాసుర వధ నాడు., భీముని వేష దారి, అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలొ వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి ''భారతం మిట్ట'' కు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పధార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పధార్థాలను అక్కడ ఒక కొత్త బట్టపై కుప్పగా పోసి అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్సితప్రదర్శిత మౌతుంది. ఈ [[మహాభారత నాటకాలు]] ఈ రోజుల్లోను జరుగుతున్నాయి.
[[దస్త్రం:Top of penance tree.JPG|thumb|right|అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం]]
;[[ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట]]; ఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి బాగ అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాం ప్రమాణ ముద్రలో [['వరానికి' ]]వడి వుంటారు. వారు దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడ వుంటారు. వారు కూడ అర్జునుడు విసిరే [[ప్రసాదం]] కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేధిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడ ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్య క్రమం సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది.
పంక్తి 39:
[[దస్త్రం:A sccne of Srishna raayabaaram..JPG|thumb|left|శ్రీ క్రిష్ణ రాయభారము నాటకములో ఒక దృశ్యము. శ్రీ క్రిష్ణుడు, ధుర్యోధనుడు, అర్జునుడు.]]
[[దస్త్రం:Bhima... make up.JPG|thumb|right|భీమునికి వేష ధారణ చేయుచున్న కళా కారుడు]]
;[[ వీధి నాటకాలు]] ఉత్సాహ వంతులైన కొంత ఊరి వారు వేషాలు కట్టి ఊరి మద్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి దానికి తెరలు కట్టి నాటకాన్ని తమ హావ భావాలతో రక్తి కట్టిస్తారు. ఈ నాటకాలను నేర్పే ఒక గురువు కూడా వుంటాడు. నాటకం వేయడానికి ముందు ఒక నెల నుండి వేషాలు లేకుండా పాటలు,పద్యాలు మాటలు గురువు గారి సమక్షంలో తర్పీదు పొందు తుంటారు. దానిని చూడడానికి కూడ ఆ వూరి జనం వస్తుంటారు. దానిని [[వద్దిక]] అంటారు. అందరు బాగా తర్పీదు పొందిన తర్వాత ఆ నాటకాన్ని ఆడడానికి ఒక రోజును నిర్ణయించి, దానికొరకు ఆ పల్లె మద్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి దానికి తెరలు కట్టి నటులందరు వేషాలు కట్టి నాటకాన్ని రక్తి కట్టిస్తారు. ప్రధాన నాటకాన్ని చూడ్డానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి జనం చాల మంది వస్తుంటారు. ఎక్కువగా [[ద్రౌపది వస్త్రాపహరణ]] నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ రోజుల్లో నాటకానికి కావలసిన సరంజామా అనగా తెరలు, బట్టలులు, ఆయుదాలు, రంగులు మొదలగు వాటిని అద్దెకు ఇచ్చే వారు చిన్న పట్టణాలలో వుండేవారు. నాటకానికి కావససిన వాయిద్య కారుల బృందాలు కొన్ని పల్లెల్లో వుండేవారు. వారి సహకారం తో ఈ నాటకాలు వేసేవారు. ప్రస్తుతం పల్లెల్లో స్వంతంగా నాటకాలు వేసే ఉత్సాహ వంతులుగాని, వాయిద్య బృందాలు గానీ, నాటక సామగ్రిని అద్దెకిచే వారు గాని ఎవ్వరు లేరు. కానీ వృత్తి రీత్యా నాటకాలు వేసే వారు అరుదుగా వుంటున్నారు. వారి వద్ద తమకు కావలసిన అన్ని పరికరాలు వుంటాయి.
 
[[బజనలు, కోలాటం]] కొన్ని వూర్లలో రామ బజను ప్రతి రోజు జరుగు తుంటాయి. సుమారు రెండు మూడు గంటలు జరిగే ఈ [[బజన]] కార్యక్రమంలో చాల మందే పాల్గొంటారు. చూసే వాళ్లు వస్తుంటారు. అప్పుడప్పుడు కోలాటం కూడ ఆడుతారు. కోలాటం లో పాడె పాటలు కూడ బజన పాటలే. కోలాటం ఆడడము ప్రస్తుతమము అంత విస్తారముగా లేదు. రామ బజనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ విధంగా పల్లె వాసులు తాము ఏర్పాటు చేసుకున్న వినోధ కార్యక్రమాలు కాకుండా పండగల రూపంలో నిర్ణీత సమయానికొచ్చే వినోధం వుండనే వున్నది.