యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపై ఆడే ప్రదర్శన.పండుగ,సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది.బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం,భాగవతారు(గాయకుడు),అభినయం,చతురసంభాషణలు,నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనచచ్చును.యక్షగానంలో పశ్చిమ రీతి ,తూర్పు రీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ రీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులున్నాయి,దక్షిన తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్తు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం. క్యాఆన్సఇ ఇక్కడ యాస అని భావించవలసివున్నది.:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం,మాండలీకము).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తరయాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉడిపిలో బడగుయాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు.పాత్రధారులు ధరించు వస్త్రధారణ,అలంకరణ,నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు.
==తాళ మద్దలె==
తాళమద్దలె అనునది యక్షగానంలో మరొక ప్రదర్సనరీతి,విధానం.ఇది బయలాటకన్న విభిన్నమైనది.ఈపద్ధతిలో వస్త్రాలంకరణ,నృత్యం మరియు భావవ్యక్తికరణ కనిపించవు.నేపథ్యం,భాగవతారు,మరియు ప్రాసంగికులు(మాటకారులు)మాత్రమే వుంటారు.ఇందులో భాగవతారు మూలకథను పాటరూపంలో పాడగా,అర్థధారులు(కథాంశమును వచనంలో వివరించువారు)పాటలోని కథాంశమును,ప్రాసంగికులతో మాట్లాడంద్వారా ప్రేక్షకులకు వివరించెదరు.బయలాటలో నృత్య,అభినయాలు ముఖ్యాంశాలు.ఇందులో సంభాషణలకు ప్రాదాన్యం ఇస్తారు.బయలాటలో వచనంకు పరిమితి వున్నది.తాళమద్దలెలో లేదు.తాళమద్దలెలో వచనమే ప్రాధాన్యం.
 
==ప్రముఖ యక్షగాన కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు