యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Kambalashwa 040.jpg|thumb|right|200px|ఉత్తరదిక్కు/తిట్టు పాత్రధారి అలంకరణ]]
[[File:Yaksha2.jpg|thumb|right|200px|దక్షిణదిక్కు/తెట్టు వేషధారణ]]
 
'''యక్షగానం''' ([[కన్నడ భాష|కన్నడం]]:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత<ref name=eb>{{cite web|url=http://www.britannica.com/eb/article-9077732/yaksha|title=yaksha|publisher=Encyclopædia Britannica|accessdate=2007-09-06}}</ref>. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ<ref>http://www.yakshagana.com/</ref>. కరావళి జిల్లాలైన [[ఉత్తర కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడుపి]] జిల్లాలలోనూ [[శివమొగ్గ]] మరియు కేరళ లోని [[కాసరగోడు]] జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు<ref>{{cite web |url= http://kasargod.nic.in/profile/yakshagana.htm|title= YAKSHAGANA}}</ref>.
యక్షగాన ప్రదర్శన సాయంత్రవేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికిగా అన్నట్టు ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై శవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కవగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా , వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుసారంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది.
ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే ఈ కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. భక్తి ఉద్యమం జరిగే సమయంలో ఉన్న శాస్త్రీయ సంగీతం ఇంకా నాటక కళ యక్షగానంగా పరిణితి చెందాయన్నది ఒక నమ్మిక<ref name="preclassical">Prof. Sridhara Uppura. 1998. Yakshagana and Nataka Diganta publications</ref>. గత కొద్ది కాలంగా బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది, ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట(గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది.
యక్షగానంలో నేపధ్యంలో హిమ్మెల నేపధ్య సంగీత సమూహం ఇంకా ముమ్మెల నృత్య మరియు సంభాషనల గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. హిమ్మెలలో ఒక భాగవత గాయకుడు(ఇతనే దర్శకుడు-ఇతన్నే మొదలనె వేష అంటారు), మద్దెల వారు, హార్మోనియం(ముందులో హార్మోనియం స్థానంలో పుంగి అనే వాయిద్యాన్ని వాడేవారు) వాయించే వ్యక్తి, ఇంకా చండె(పెద్ద ధ్వని చేసే డప్పులు) వాయించేవారు ఉంటారు.
సంగీతం మట్టు మరియు యక్షగాన తాళాలతో రంగరించిన కర్ణాటక సాంప్రదాయ రాగాలపై ఆధార పడి ఉంటుంది. యక్షగాన తాళాలే తరువాతి రోజుల్లో కర్ణాటక సంగీత తాళాలుగా మార్పుచెందాయన్నది ఒక మాన్యత.
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు