యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 23:
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికె '(మాతు=మాట)అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము(Back ground)''':
యక్షగానంలో నేపథ్యమును
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపై ఆడే ప్రదర్శన.పండుగ,సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది.బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం,భాగవతారు(గాయకుడు),అభినయం,చతురసంభాషణలు,నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనవచ్చును.యక్షగానంలో పశ్చిమ రీతి ,తూర్పు రీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ రీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులున్నాయి,దక్షిన తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం,తెట్టు అనగా దిక్కు అని అర్థం. తెట్టు అనేపదమే వ్యవహారికంలో తిట్టుగా మారివుందవచ్చును, ఇక్కడ తిట్టు అనగా దిక్కులేదా యాస అని భావించవలసివున్నది.యాస:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉడిపిలో బడగు యాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు.పాత్రధారులు ధరించు వస్త్రధారణ,అలంకరణ,నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు.మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.
|