"ఏనుగుల వీరాస్వామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
కష్టాలు పడి, స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన వీరాస్వామి పండితుడు, వివేకవంతుడే కాక వినయశీలి. ఇంగ్లీషు దొరలవద్ద ఉద్యోగం చేస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాగాని తన మతం, సంప్రదాయం పట్ల తన భావాలను నిర్భయంగా ప్రకటించేవాడు. ఎంత పెద్ద దొరతోనైనా వాదానికి దిగి భిన్న మతతత్వాలకు సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసేవాడు. అయినా వారి అభిమానాన్ని అతను నిలుపుకొన్నాడు.
 
ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి, దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టు బట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆపే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.
 
 
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/847576" నుండి వెలికితీశారు