అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==పని చేయు విధానం==
ఈ పరికరం [[విద్యుత్ మోటారు]] సహాయంతో ఒక అక్షం చుట్టూ తిరుగుతుంది. ఇచ్చిన మిశ్రమాన్ని ఈ పరికరంతో అనుసంధానించబడిన పాత్రలో వేసి, అక్షం ఆధారంగా త్రిప్పినట్లైతే, బరువుగా గల కణాలు వెలుపలికి వెళ్లిపోతాయి. ఈ విధంగా తక్కువ, ఎక్కువ భారాలు గల కణాలను వేరుచేయవచ్చు.
 
 
==ఉపయోగించే సందర్భాలు==
*సెంట్రిఫ్యుజ్ లను నూనె పరిశ్రమలలో ఎక్కువ ఉపయోగిస్తారు.నూనెలోని తేమను,ఘన,అర్ధఘన రూపంలోని మలినాలను తొలగించుటకు,కెమికల్ రిఫైనింగ్ సమయంలో ముడిసబ్బు(soap stack)రూపంలో నూనెలోని స్వేఛ్ఛాచలిత కొవ్వుఆమ్లాలను( free fatty acids)ను తొలగించుటకు,గమ్స్(gums)ను తొలగించుటకు వినియోగిస్తారు.పరిశ్రమలలో వినియోగించె అపకేంద్రియ యంత్రాలు పలు నిర్మాణలలో లభిస్తాయి.ఇందులో గొట్టం(tubular) రకం మరియు డిస్క్(Disk)రకం ఎక్కువగా వాడుకలో వున్నాయి.డిస్కు రకములో వెర్టికల్,హరిజంటల్ అనురెండు రకాలున్నాయి.హరిజంతల్ రకాన్ని పామాయిల్ రిఫైనరీలలో వాడెదరు.
* ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిగేటప్పుడు, ద్రావణంలో అవక్షేపాన్ని వేరు చేయటానికి ఉపయోగిస్తారు. ఉదా: బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ లను పరీక్షనాళికలో కలిపినపుడు క్రియాజన్యాలుగా బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్ ఏర్పడతాయి. ప్రయోగ సమయంలో క్రియా జన్యాలను వెంటనే వేరుచేయాలంటే అపకేంద్ర యంత్రం ఉపయోగిస్తారు.
* మజ్జిగ నుండి వెన్నను సులువుగా తీయటానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు