శ్రుతి హాసన్: కూర్పుల మధ్య తేడాలు

సినీజీవిత సంబంధ విషయాలను జతచేసాను.
సినీజీవిత సంబంధ విషయాలను జతచేసాను.
పంక్తి 15:
==సినీ జీవితం==
===కెరియర్ తొలినాళ్ళు (2000, 2008-2011)===
2000లో తన తండ్రి [[కమల్ హాసన్]] దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో [[కె.రాఘవేంద్రరావు]] గారి కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో [[సిద్ధార్థ్సిద్దార్థ్]] సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది.కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.
 
అదే సంవత్సరంలో "దిల్ తో బచ్చాహై జీ" సినిమాలో అతిథి పాత్రలో నటించిని శ్రుతి ఆపై ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో [[సూర్య శివకుమార్|సూర్య]] సరసన "7అం అరివు" సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన "[[ఓ మై ఫ్రెండ్]]" సినిమాలో నటించింది. [[చిరంజీవి]] గారి "[[ఇద్దరు మిత్రులు]]" సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది.
 
===గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి ప్రస్థానం (2012-ఇప్పటి వరకు)===
ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో [[పవన్ కళ్యాణ్]] సరసన "[[గబ్బర్ సింగ్]]" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. ప్రస్తుతం శ్రుతి తెలుగులో [[రవితేజ]] సరసన "[[బలుపు]]", [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్.]] సరసన "[[రామయ్యా వస్తావయ్యా]]", [[రాంచరణ్ తేజ]] సరసన [[ఎవడు (సినిమా)|ఎవడు]], హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లో నటిస్తోంది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రుతి_హాసన్" నుండి వెలికితీశారు