అపకేంద్ర యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ప్రయోగశాలలో ఉపయోగించు అపకేంద్రియ యంత్రాలు పరిమాణంలో చిన్నవిగా వుంటాయి. వీటిద్వారా తక్కువ ప్రమాణంలో మాత్రమే ద్రవాలను, అవక్షేపాలను వేరుచెయ్యుదురు. ఇందులో రెండురకాలు చేతితో త్రిప్పునవి, విద్యుత్తుయంత్ర సహాయంతో తిరుగునవి. ప్రస్తుతం చేతితో త్రిప్పు అలకేంద్రపరికరాలను వాడటం లేదు. చేతితోతిప్పడం వలన భ్రమణ వేగంస్థిరంగా, నిలకడ వుండందు, అందువలన పదార్థాలు సరిగా అపకేంద్రితం చెందవు. ఇక విద్యుత్తుతో పనిచేసె అపకేంద్రిత పరికారాలు రెండు విధాలు, ఒకటి ఫిక్సుడ్ హెడ్ (Fixed head). రెండవది స్వింగ్ హేడ్ (swing head)
 
'''ఫిక్సుడ్‌హెడ్ ''':ఈరకం అపకేంద్ర యంత్రం ఒకపెట్టెవలెవుండును. ఇందులో విద్యుత్తు యంత్రం నిలువు అక్షం (ఇరుసు) పైన ఒకలోహదిమ్మె (hub) అమర్చబడి వుండును. దీనికి రెండు, లేదా నాలుగు లేదా ఎనిమిది ఇలా సరిసంఖ్యలో గొట్టం ఆకారంలో రంధ్రాలుండును. ఈ గొట్ట రంధ్రాలు అక్షరేఖకు ఏటవాలుగా వుండును. ఈ గొట్టాలలో పేరు చేయవలసిన ద్రవాలున్న పరిక్షనాళికలు వుంచెదరు. ఎప్పుడు ఒకపరిక్షనాళికను పరికరంలో వుంచరాదు. సరిసంఖ్యలో వుంచాలి. రెండు పరిక్షనాళికలుంచునప్పుడు ఎదురెదురుగా వుంచాలి. అన్నిగొట్టలలో సమానపరిమాణంలో పదార్థాలను తీసుకోవాలి. పరిక్షనాళికలను ఎదురెదురుగా వుండకపోయిన, తీసుకున్న ద్రవాలలోద్రవ్యరాశిలో ఎక్కువ తేడా వునచో, పరికరాన్ని త్రిప్పినప్పుడు, హెడ్ యొక్క భ్రమణభారంలో ఎచ్చుతక్కువల కారణంగా విపరీతమైన ప్రకంనలు పరికరంలో ఏర్పడును. అందుచేత ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి. విద్యుత్తు యంత్రం యొక్క భ్రమణ వేగాన్ని పెంచుటకు, తగ్గించుటకు ఉపకరణముండును. యంత్రంను త్రిప్పుటకుముండు మూతను గట్టిగా బిగించి, ఆటు పిమ్మటవిద్యుత్తు యంత్రం మీటను నొక్కాలి. ప్రారంభంలో మోటారును తక్కువ వేగంతో ప్రారంభించాలి. అతరువాత క్రమంగా యంత్ర వేగాన్ని కావలసిన మేరకు పెంచాలి.భ్రమణవేగాన్ని సూచించు డిజిటల్ మీటరు వుండును. ఆవక్షేపం ఏర్పడిన తరువాత వెంటనే విద్యుత్తును ఆపరాదు. వేగాన్ని క్రంగా తగ్గించుకుంటూ వచ్చి ఆపవలెను. లోపలి హెడ్ తిరగడం పూర్తిగా నిలచిన తరువాత మాత్రమే పరికరం మూత తీయాలి. మూతకు ఒక దళసరి గాజుపలక బిగించబడి వుండును. దానిద్వారా లోపల హెడ్ తిరుగుచున్నది, నిలిచింది కన్పిస్తుంది.
 
'''స్వింగ్ హెడ్ ''':ఇదికూడా పెట్టెవలె వుండును.పైన మూతవుండును. ఈ యంత్ర పరికరములో మోటారు అక్షమునకు తేలికపాటి శీర్షము(head)బిగింపబడివుండును.ఈ లోహశీర్షభాహానికి రెండు లేదా నాలుగు, లేదా ఎనిమిది పైకి,క్రిందికి సులభం గా కదిలే మడతబందులతో(hinges)అమర్చిన లోహగొట్టాలుంటాయి.ఈ గొట్టలలో సెంట్రిఫ్యుజ్ గాజునాళికలుంచెదరు.ఈ గొట్టలు పరికరం నిలచివున్నపుడు నిలువుగా క్రిందికి వ్రేలాడి వుండును.పరికరం తిరుగుతున్నప్పుడు అక్షమునకు వలయాకారంలో భూమికి సమాంతరంగా(క్షితిజ సమాంతరం:horizontal)పైకిలేచి తిరుగును.ఇందులోకూడా విద్యుత్తుయంత్ర భ్రమణవేగాన్ని నియంత్రించు ఉపకరణం బిగించబడివుండును.ఈ పరికరంలో పరిక్షించవలసిన పదార్థములను తీసుకొను గాజుగొట్టమునకు మి.లీ.లలో విభజన గీతలు వుండును.వీటిని గ్రాడ్యుయెటెడ్ సెంట్రీఫ్యుజ్ ట్యూబ్‌లు అంటారు.ఈపరికరంను నడుపు విధం పైన పేర్కొన్న ఫిక్సుడ్‌హెడ్ అపకేంద్ర యంత్రం చేసినట్లు చేయ్యాలి. ఈ పరికరం వలన అదనపు ప్రయోజమేమిటంటే గాజుగొట్టమునకు విభజన గీతలుండటం వలన,పరిక్షపూర్తయ్యిన వెంటనే,ట్యుబ్ లో ఏర్పడిన అవక్షేపంను ఏమేరకువున్నదో(మి.లీ) తెలిసి పోతుంది.దానిప్రకారం వెంటనే అవక్షేపంశాతంను త్వరితంగా లెక్కించె వీలున్నది.
'''స్వింగ్ హెడ్ ''':ఈ యంతపరికరములో మోటారు అక్షమునకు తేలికపాటి శీర్షము(head)బిగింపబడివుండును.ఈ లోహశీర్షభాహానికి రెండు లేదా నాలుగు పైకి,క్రిందికి సులభం
 
===ఉత్పత్తి పరిశ్రమలలో ఉపయోగించునవి===
"https://te.wikipedia.org/wiki/అపకేంద్ర_యంత్రం" నుండి వెలికితీశారు